పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికాలో తెలుగులో ఎన్నికల సామగ్రి!

బహుభాషా బ్యాలెట్లు ప్రజాస్వామ్యంలో ఒక ప్రాథమిక దశ.

అమెరికన్‌ ప్రజాస్వామ్యంలో పూర్తిస్థాయిలో పాల్గొనడానికి ఒక వంతెన


ఈమధ్య, తెలుగును యునైటెడ్‌ స్టేట్స్‌ అధికారిక భాషగా గుర్తించారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం, డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా జో-బిడెన్‌ ఇద్దరూ తమ ఎన్నికల ప్రచారంలో, ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో, వారిని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా భారతీయ భాషలను వాడుతున్నారు.

ఎనిమిది రాష్ష్ట్రాల్హో ఒక అధికార పరిధిలో మాత్రమే ఆంగ్లేతర బ్యాలెట్లను అందించటం జరుగుతోంది (కొన్నిచోట్ల ఒకటి కంటే ఎక్కువ భాషలలో): అవి జార్జియా, హవాయి, ఇడాహో, మేరీల్యాండ్‌, నెవాడా, ఓక్షహోమా, ఉటా, వర్జీనియా. మరో మూడు రాష్ట్రాలలో - కాలిఫోర్నియా, ఫ్లోరిడా మరియు టెక్సాస్‌లలో మాత్రం రాష్ట్రవూప్తంగా జారీ చేయబడిన ఏదైనా ఎన్నికల విషయాలను స్పానీష్‌ అనువాదాలను కూడా అందించాలి.

“ది హన్స్‌ ఇండియా” లో “యు ఎస్‌ఎలో తెలుగు భాష అధికారిక భాషగా గుర్తించబడి అమెరికన్‌ బ్యాలెట్‌ పెట్టెలో చోటు సంపాదించింది”. అని ఆంగ్ల శీర్షికతో ప్రచురించిన వ్యాసం ఆధారంగా అనేక మంది సామాజిక మాధ్యమాలలో రాస్తున్నారు. ఐతే, అమెరికా ఇంతవరకూ ఇంగ్లీషును గానీ మరే ఇతర భాషనూ అధికారిక భాషగా గుర్తించలేదు. కానీ అమెరికాలో అతి వేగంగా అభివృద్ది చెందుతున్న భాషలలో తెలుగు ఒకటి అనేదీ, అమెరికా రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్లు తెలుగులో, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని విదేశీ భాషలలో కూడా ముద్రించబడుతున్నాయి. అనేది మాత్రం నిజం.

అమెరికాలో ఇప్పటివరకూ ఒక అధికారిక భాష అంటూ లేదు. ఐతే ఈ మధ్యన అనేక సందర్భాల్లో, అమెరికా పార్లమెంటు లేక కాంగ్రెస్‌ సభ్యులు ఇంగ్లీషును అధికారిక భాషగా గుర్తించడానికి ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. ఇంగ్లీష్‌, వాస్తవానికి, యుఎస్‌లో అత్వధికుల వాడుక భాషే కానీ దాన్ని రాజ్యాంగంలో లేదా సమాఖ్య చట్టాలలో అధికారిక భాషగా గుర్తింపు ఇవ్వనవసరం రాలేదు.

“ఆ దేశ వ్యవస్థాపక నేతలకు ఎవ్వరికీ అలా ఒక భాషను ఒకదాన్ని అధికారక భాషగా ప్రకటించాల్సిన అవసరం కనిపించలేదు”. అప్పటికి అమెరికాలో ఆ సమయంలో ఇంగ్లీషు ఒక ఆధిపత్య భాష, కాబట్టి దాన్ని రక్షించాల్సిన అవసరం కనిపించలేదు. యుఎస్‌లో మాట్లాడే 350 భాషల్లో తెలుగు వేగంగా అభివృద్ధి చెందుతోందని “బిబిసి వార్త” ప్రకటించడం అందరికీ తెలిసిందే. 2018లో ఒక అమెరికన్‌ గణాంక అధ్యయనాల ప్రకారం, 2010-2017 మథ్య తెలుగు మాట్లాడేవారి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

5