పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంఖ్య 86 శాతం పెరిగిందనేది కూడా వాస్తవమే.

ప్రతిసారీ, అ.సం.రా.లలో, ఆంగ్ల ప్రావీణ్యం పరిమితంగా ఉన్న ఓటర్లకు సహాయపడేందుకు వీలుగా ఎన్నికలలో బ్యాలెట్‌ పేపర్లు బహుళ భాషలలో ముద్రించబడతాయి. వర్జీనియా, టెక్సాస్‌, ఇల్లినాయిస్‌ ఇంకా కాలిఫోర్నియా వంటి రాష్ష్ట్రాల్హో తెలుగువారు గణనీయంగా ఉన్నప్రాంతాలు కాబట్టి ఈ రాష్ట్రాల్లో కొన్నింటిలో బ్యాలెట్లు తెలుగులోనూ, ఇతర విదేశీ భాషలలో కూడా అందుబాటులో ఉన్నాయి.

1975 లో, “భాషా అల్బసంఖ్యాక వర్గాలకు ప్రత్వేక రక్షణలను చేర్చడం ద్వారా ఓటింగ్‌ హక్కుల చట్టపు మౌలిక ఉద్దేశ్యాన్ని కాంగ్రెస్‌ బాగా విస్త్రృతపరిచింది. ఆ చట్టంలో 203 అధికరణం కింద రక్షణ కోసం భాషా అల్బసంఖ్యాక వర్షాలు, అంటే అమెరికన్‌ ఇండియన్లు (రెడ్‌ ఇండియన్లు), ఆసియా అమెరికన్లు, అలాస్కా స్థానికులు ఇంకా స్పానిష్‌ వారసత్వ పౌరులు మొదలైనవారు ఉన్నారు. అమెరికా చరిత్రలో వెబట్టమొదటిసారిగా 1975నుంచి ఈ రక్షిత భాషా అల్పసంఖ్యాక వర్షాలు గణనీయంగా ఉన్న రాష్ట్రాలూ జిల్లాలలో ఇంగ్లీష్‌ తోపాటు ఇతర భాషలలో బ్యాలెట్‌ ఇంకా ఎన్నికల సామ్మగ్రిని అందించాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. మొదట్లో వీటిని తాత్మాలిక నివారణలుగా ఉద్దేశించినప్పటికీ, అవి 1982 లోనూ, 1992లోనూ పునరుద్దరింపబడి 2006లో మరో 25 సంవత్సరాలపాటు ఉండేట్లుగా నిర్ణయించారు.

ఇతర భాషలలో బ్యాలెట్లూ ఓటింగ్‌ సామగ్రిని తప్పనిసరి చేయడానీకి ఏకైక తార్మిక కారణం ఇంగ్లీషు అంతగా రానివారికి ఓటింగ్‌ను సులభతరం చేయడం ఇంకా ప్రోత్సహించడం కోసమే-అయితే కొంతమంది ఆంగ్ల ఆధిపత్య భాషావాదులు ఇది సమాఖ్య చట్టం ఉల్లంఘన అనే ప్రతిపాదనను ముందుకు తీసుకువస్తున్నారు. ఎందుకంటే, ద్విభాషా బ్యాలెట్లు అమెరికా పౌరసత్వం అర్జాన్ని తక్కువ చేస్తాయట, ఓటర్ల మోసాలను ప్రోత్సహిస్తాయట ఇంకా అక్కడున్న ప్రవాసులూ వలనదారులూ ఇంగ్లీష్‌ నేర్చుకునేందుకు కావలనిన ప్రోత్సాహాన్ని తగ్గించడం తద్వారా సహజీకరణ ప్రక్రియనూ సమగ్రతనూ దెబ్బతీస్తాయట. అందుకనే ఈ మధ్యనే మా పిల్లలకోసం ఇంగ్లీషును కాపాడండి, ఇంగ్లీషును అధికారికంగా చేయడానికి మాకు సహాయపడండి! అంటూ తదుపరి ఎన్నికల్లో బహుభాషా బ్యాలెట్లను ఆపడానికి ప్రోఇంగ్లీషు వాదులు పోటీపడుతున్నారు. అమెరికాలో ఉమ్మడి, ఏకీకృత భాషగా ఇంగ్లీష్‌ యొక్క చారిత్రాత్మక పాత్రను రక్షించడానికి ప్రభుత్వంలోని అన్ని స్థాయిలలో ఇంగ్లీషును అధికారిక భాషగా స్వీకరించడానికి చట్టసభ సభ్యులను ఒప్పించడానికీ న్యాయస్థానాల ద్వారానూ ఇంకా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఒప్పించేందుకూ వనిచేస్తామని ప్రొఇంగ్లీషు వాదులు బలంగా వాదిస్తున్నారు.

ఐతే, ఓటింగ్‌ ప్రజాస్వామ్యానికి ఒక ముఖ్యమైన మూలస్తంభం. యునైటెడ్‌ స్టేట్స్‌లో, పరిమిత ఆంగ్ల ప్రావీణ్యం ఉన్న ఓటర్లకు తమ నాయకులను ఎన్నుకోవటానికీ సమస్యలపై లోతుగా అలోచించేందుకు వీలు కలిగించదానికీ బ్యాలెట్లు బహుళ భాషలలో కనీపించాలని భాషా అల్పసంఖ్యాక వర్గాల అనుకూలుర వాదన.

పౌర పరికల్పనా కేంద్ర నిర్దేశకుడైన విట్నీ క్యూసెన్‌బరీ బహుభాషా బ్యాలెట్లను ప్రజాస్వామ్యంలో ఒక ప్రాథమిక దశగానూ, అమెరికన్‌ ప్రజాస్వామ్యంలో పూర్తిస్థాయిలో పాల్గొనడానికి ఒక వంతెనగా వర్ణిస్తున్నారు. మొదటిసారి-ఓటర్లకు వారు బ్యాలెట్‌ను సరిగ్గా నింపుతున్నారనే నమ్మకాన్ని ఇవ్వడానికి బ్యాలెట్లు సహాయపడతాయి. “ఎన్నిక యంత్రాంగాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రజలకు మనం ఎంత ఎక్కువగా సహాయపడతామో ... మన సమాజంలో వారు పూర్తి సభ్యులుగా మారడానికి అంత సులభతరం అవుతుందని” అని క్యూసెన్‌బెర్రీ అంటున్నారు.

కొంతమంది అలాస్కా స్థానికులూ, స్థానిక రెడ్‌ ఇండియన్‌ అమెరికన్‌, ఆసియన్‌ అమెరికన్‌ ఇంకా స్పానీష్‌ అమెరికన్‌ల- వారసత్వ పౌరులు ఎదుర్కొంటున్న ఎన్నికలలో అడ్డంకులను తొలగించడానికి, యు.ఎస్‌. కాంగ్రెస్‌ 1965 లో ఓటింగ్‌ హక్కుల చట్టానికి సవరణలుగా 1975 లో భాషా ప్రాష్యత నిబంధనలను జోడించింది.

ఆ సవరించిన చట్టంలో 203వ అధికరణం (ప్రకారం, 10,000 లేదా 5% కంటే ఎక్కువ ఓటింగ్‌-వయస్సు ఉన్న పౌరులు ఒక భాషా అల్బసంఖ్యాకవర్షానికి చెందినవారైతే, అక్షరాస్యత రేటును తగ్గించి, ఇంగ్లీష్‌ బాగా మాట్లాడకపోతే న్యాయ పరమైన మినహయింపులతో భాషా సహాయాన్ని అందించాలి అనేది సారాంశం

ఇంగ్లీషూ, తెలుగుతోపాటు స్పానిష్‌ చెనీస్‌, హిందీ, కొరియన్‌, తెగలోగ్‌, అరబిక్‌, గుజరాతీ, పోలిష్‌ రష్యన్‌ ఉక్రేనియన్‌ ఇంకా ఉర్దూ భాషలలో ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా బహుభాషా బ్యాలెట్లు వాడుకలో ఉన్నాయి. ప్రో ఇంగ్లీషు వాదుల బలం పెరిగి సమీప భవిష్యత్తులో ఇంగ్లీషు తప్ప మరే భాషకూ చోటుదొరకని కాలం రావచ్చు. అలాంటి వాదనలకు బలం చేకూర్చేదే “ఇంటగెలిచి గదా రచ్చ గెలవాలనే వాదన! అందుకనే, ముందుగా భారతీయ భాషలు ఐడి భాషలుగా మారాలి.

(అమ్మనుడి ప్రతినిధి)

“ఎక్స్‌రే' అవార్డుకు కవితలు ఆహ్వానం

తెలుగు కవిత్వం అనేక ప్రాపంచిక పరిమాణాలకు స్పందిస్తూనే ఉంది. నాలుగు దశాబ్దాలుగా తెలుగు వచన కవితారంగంలో విశిష్ట స్థానాన్ని పొంది, నిరంతర సాహిత్య పాఠశాలగా వెలుగొందుతున్న “ఎక్స్‌రే” జాతీయస్థాయి అవార్డుకు కవితలను ఆహ్వానిస్తున్నది. ప్రథాన అవార్డుకు ఎంపికైన కవితకు పదివేలు రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక, సత్మారము, మరో పది కవితలకు ఉత్తమ కవితా పురస్కారాలు ఇవ్వబడతాయి. చారిత్రక వికాసాన్ని క్రమపద్ధతిలో పదిలపరిచే ఈ ప్రయత్నంలో కవులు పాల్గొని సహకరించగలరు. కవితా వస్తువు, పరిధి విషయాల్లో కవికి స్వేచ్చ ఉంటుంది. ఈ సంవత్సరం డిశెంబరు 25వ తేదీన విజయవాడలో జరిగే సభలో ఈ అవార్డులు బహూకరించబడతాయి.

కవితలు నవంబరు 30వ తేదీలోగా ఎక్స్‌రే, డోర్‌ నం. 20-15-2, దాసువారి వీధి, అరండల్‌పేట, విజయవాడ - 2 చిరునామాకు పంపవలెను. వివరాలకు :98484 48763

కొల్లూరి ఎక్స్‌రే అధ్యక్షులు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

6