పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రణాళిక చేయవచ్చు. ప్రతి పాఠశాలలోనూ స్థానిక వనరులను సృజనాత్మకంగా వినియోగించుకోవచ్చు. ప్రాంతాలలో ఉన్న వైవిధ్యాన్ని బట్టి ఒక విస్తృత విధానం ఉండాలి. ప్రతి పాఠశాల సెమీ-మరాఠీ విధానాన్ని రూపొందించాలి. కొంత మంది ఉపాధ్యాయులు ముఖ్యంగా 1 లేక 2 తరగతులో బోధించేవారు చూపిన విధంగా దీన్ని చేయవచ్చు.

జి. ఎన్‌. దేవి నేతృత్వంలోని ఆదివాసి అకాడమీ నుండి సాధనా సక్సేనా (2018) పేర్కోన్న ఉదాహరణలలో నేర్చుకోగలిగిన అనేక ప్రయోగాలు ఉన్నాయి. వాళ్లు ప్రవేశపెట్టిన గిరిజన భాషలలోని వాచకాలను మరింత విస్తృతంగా అమలు చేయాలి. మరాఠీ క్రమంగా పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది. అన్ని స్థాయిలలో తరగతి గదులలో గిరిజన (ప్రాంతీయ భాషలలో చర్చను ప్రోత్సహించాలి. పాఠశాల యొక్క మౌఖిక సంస్కృతి, తరగతి గది లోపల వెలువల, పిల్లల భాషలో ఉండాలి. దీనిని 2006 లో ఎన్‌సీఈఅర్టి ఫోకస్‌ గ్రూప్‌ పేపర్‌ సూచించింది, కాని మనం దీనిని విస్మరించాం.

ఎన్‌సిఇఅర్‌టి (2006 ఎ) సూచించినట్లు: “సాధారణంగా, గిరిజన పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు వారి విద్యార్థుల లేదా వారి తల్లిదండ్రుల భాషలు తెలియదు. ఒరిస్సాలోని గిరిజన పాఠశాలల్తో, విద్యార్థులు ఉదయం 10.00 నుండి సాయంత్రం 4:30 గంటల మధ్య పాఠశాలలో తమ ఇంటి భాషను ఉపయోగించవద్దని హెచ్చరిస్తున్నారు. ఈశాన్య ప్రాంతం,ఇంకా ఢిల్లీ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి! అనేక అధ్యయనాలు గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులు తమ పాఠ్యపుస్తకంలో 5 వ తరగతిలో పూర్తి వాక్యాన్ని చదవలేరని తేల్చాయి. వారు అక్షరాలను గుర్తించి పదాలను కష్టంతో పలుకుతారు. ఉపాధ్యాయులు నేర్చుకునేవారి భాషలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఇంటిభాష పొరుగుభాష బడిభాషల మధ్య అంతరాలను తగ్గించడానికి ప్రత్యేక పద్దతులను రూపొందించాల్సి ఉంటుంది. చాలా తరచుగా, తరగతి గది వ్యవహార నిర్వహణ అనేది ఉపాధ్యాయుడి నుండి ఏక మార్గ సంభాషణా విధానంలో విద్యార్థులు నేర్చుకుంటారనే దానీకి ఎటువంటి హామీ లేదు. బహుభాషావాదాన్ని ప్రోత్సహించదానీకీ ఈ పత్రంలో మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఈ రకమైన జ్ఞాన వృద్దిని ప్రొత్సహించదానికీ, ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థుల భాష(ల)ను నేర్చుకోవడం తప్పనిసరి.” (2006 ఎ: 27).

దీనికి విరుద్దంగా, మహారాష్ట్రలోని సెమీ -ఇంగ్లీష్‌ పాఠశాలలతో ఇంటిభాషపట్ల ప్రతిష్ట గౌరవాలతో వారు దానిని సహజపద్దతిలో ఉవయోగించదానికి అనుమతించింది. భాషా శాస్త్రవేత్తలు సూచించినట్లు ఒక భాషలో పటిమ మరాక భాషను సులభంగా పొందడంలో సహాయపడుతుందని నొక్కిచెప్పదం కాకతాళీయం కాదు.సెమీ-మరాఠీ విధానం గిరిజన ప్రాంతాలకు సమానంగా ప్రభావవంతంగా ఉంటుంది. గిరిజన సంస్కృతులపట్ల మన అనుచిత ప్రవర్తన తగ్గటం వలన కూడా గిరిజనులలో తిరుగుబాటు ధోరణి నెమ్మదిగా మారుతుంది (దేవీ 2017).

పాఠశాలల్లో ఇంగ్లీషుకు మారేందుకు నమ్మకమైన మార్దాలు కొరవడినందున, బహుభాషా విధానం విస్మరించబడుతోంది.

గ్రామ స్థాయిలో ప్రభుత్వ మధ్య ఇంకా ఉన్నత పాఠశాల ఇప్పుడు తనను తాను సెమీ-ఇంగ్లీషుగా మార్చుకౌంటోంది. ప్రాథమిక పాఠశాల మరాఠీ మాధ్యమంగా ఉంది. హైస్కూల్‌ వరకు అన్ని తరగతులలోనూ తరగతి గది సంస్కృతి సెమీ-ఇంగ్లీష్ మాధ్యమం లేదా ద్విభాషా మాధ్యమంగా 1980 లలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించబడింది. 2005 లో మాధ్యమం ప్రజాదరణ కారణంగా, మహారాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న ప్రభుత్వ పాఠశాలలకు 5 వ తరగతి నుండి సెమీ-ఇంగ్లీష్‌ ప్రారంభించింది. ప్రభుత్వం,తరువాత, (ఫైవేట్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలకు పిల్లలు నిష్క్రమించే విధంగా 2010 తరువాత విస్తరించబడింది. మహారాష్ట్రలొ ఈ విధానంపై చర్చ జరుగుతోంది, కానీ ఈ విధానంపై ప్రజల విశ్వాసం కూడా ఉంది. అయితే ఇక్కడ కూడా ఈ పాఠశాలల్లో కొన్ని మొదటి తరగతి నుండి ఇంగ్లీష్‌ మాధ్యమం కావాలని కోరుకుంటాయి. ఆం.ప్ర. లాంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు “పూర్తి ఇంగ్లీష్‌ మీడియం ప్రభుత్వ పాఠశాలల కోసం కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

నాటకీయంగా వ్యతిరేక ఆలోచనలు ఈ అలవాటును ఎలా ప్రభావితం చేస్తాయి? వారు ఇంగ్లీష్‌ కోసం ఆశించే అభిలాష వైపు వేర్వేరు మార్గాలను సూచిస్తున్నారు. ఈ ఆలోచనలు పాత చర్చ నుండి తీసుకోబడ్డాయి. ఏకభాషా దృష్టి ఉత్తమమైనది అనే స్థితికి ఈ ఆలోచనను పాఠశాలలు చేరుకుంటున్నాయి. ఈ దృష్టిలో ఇతర భాషలు ఆటంకం కలిగిస్తాయి వాటిని 'నిషేధించాలి” లేదా అప్రధానమైన అంశంగా ఉంచాలి. వారు ఇంగ్లీష్‌ కోసం కృత్రిమ ద్వీపాలను సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ఆధిపత్య భాషపైనే వారికీలక దృష్టి ఎన్సీఈఆర్టీ (2006a) ప్రధాన విధాన పత్రం చెప్పినట్లుగా, “చాలా కాలం నుండి, ద్విభాషావాదం విద్యావిషయక సాధనకూ ఎరుకువ పెరుగుదలకూ ప్రతికూల సంబంధాన్ని కలిగి ఉందని నమ్మేవారు...” (2006 ఎ: 21) మరోఅఖిప్రాయం ప్రకారం, పిల్లల ప్రాంతీయ భాష ఆధారంగా బహుభాషా విధానాన్ని సూచిస్తుంది. అన్నీ భాషలకూ సుసంపన్నమైన వాతావరణాన్ని సృష్టించండి. స్థానిక సందర్భం ఆధారంగా ఆంగ్ల పరివర్తనను ఉద్దేశపూర్వకమ్లైన ప్రణాళికలో ప్రాంతీయ భాషను ఉపయోగించండి. అనేక నివేదికలు సూచించినట్లుగా ప్రారంభ సంవత్సరాల్లో మాతృభాష ఆధారిత ద్విభాషా లేదా పరస్పరాధారిత భాషా విద్యను ప్రోత్సహించడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉదాహరణకు ఐరాస తయారించిన ఇటీవలి సమీక్ష చూడండి (జెస్సికా బాల్‌ (2011). నూతన స్థాయీ నైపుణ్యాలు “ఒక భాష నుండి మరొక భాషకు తేలికగా బదిలీ చేయబడతాయి. చాలావరకూ కావాలనీ మార్పు కోసం అభ్యాసకుడు అదనపు ప్రయత్నం చేయనవసరం లేదు” అనే తర్కం మీద ఆధారపడి

తరువాయి 18వ పుటలో.......

తెలుగుజాతి పత్రిక 'అమ్మనుడీ * నవంబరు-2020

14