పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపాధ్యాయులను ఇంగ్లీషూ గణితాలను బోధించదానికీ ఆంగ్ల పాఠ్యపుస్తకాలను అనుకరించడానికి నియమించారు. ఈ అదనప్తు ఉపాధ్యాయులకు సంఘం మద్ధతు ఇచ్చింది. ఇది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను నిలుపుకునే మార్గం కాబట్టి ప్రిన్సీపాల్‌ అంగీకరించారు. నాలుగు నెలల తరువాత ఈ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అసంతృప్తి చెందారు. కొత్త ఉపాధ్యాయులు చిత్తశుద్ది గలవారే కానీ పిల్లలు ఈ ప్రయోగం వల్ల చాలా కలవరపడ్డారు. “వారి సంఖ్యా జ్ఞానం చాలా బలహీనంగా ఉంది. నేను నా పద్దతులను అనుసరించి వుంటే మేము చాలా బాగా చేసివుండేవారం”అని ఉపాధ్యాయులలో ఒకరు వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రయోగం ఇతర కారణాల వల్ల త్వరలోనేముగిసింది (రెండు గ్రామ పరిస్థితుల డాక్యుమెంటేషన్‌ ఆధారంగా).

ఉన్నత వర్ణాల నుండి వచ్చిన ఈ గ్రామీణ పిల్లలను ఆంగ్లంలో పాఠ్యపుస్తకాలు ఉన్న పాఠశాలలకు పంపిస్తారు, తరగతిలో హిందీ నిషేధించబడింది. 3 వ తరగతి నుండే ఇంగ్లీషును ప్రవేశపెట్టాలని కోరిక. ఇంకా ఇంగ్లీషు మాధ్యమ పాఠశాలలు ఎలావ్వాప్తిచెందాలి అనే ఆలోచనతో, వారిలో ఎక్కువ మందినీ ఆంగ్లంలో ఏకభాషా దృష్టితో ద్వీపాల్లాగాతయారు చేసేపనీలో పట్టణంలోని పాత ఉన్నత పాఠశాలలు తమకు నిర్దేశించిన నిబంధనలను అనుసరిస్తాయి. ఉపాధ్యాయుల సొంత ఆలోచనలను పక్కన పెట్టబడతాయి. తరగతి గదుల వెలుపల, పనిలో, బజార్‌లో లేదా ఆట స్థలంలో ఉన్నా వాళ్లంతా బహుభాషీయులే. ఇంకా పాఠశాల భాషా బోధన విషయానికి వస్తే భాషా నిపుణుల సలహాలన్నింటినీ విస్మరించి, కృత్రిమ పరిష్కారాల వైపు మొగ్గు చూపుతారు.

ఆధిపత్య భాష పైన దృష్టి:

పాఠశాలల్లో ఉన్న ఏకభాషా విధానం ఒక్క మధ్యప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైనది కాదు. ఇది ఒక విస్తృతమైనది. వీక్షణ విరుద్దంగా మహరాష్ట్రలో కూడా ఆంగ్ల భాష పై ఉన్న ఆకాంక్ష ఒక మధ్యే మార్గాన్ని కనుగొనడమే అయినా, గిరిజన భాషల పట్ల ఈ విధానం భిన్నంగా ఉంది. అదే తర్కం ఉపయోగించి, పిల్లలపై వత్తిడి తెచ్చి ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు వస్తాయనే నెపంతో ఆధిపత్య భాషైన మరాఠీ భాషను విధించడం. గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లోనూ జిల్లా పరిషత్‌పాఠశాలల్లోనూ, ప్రాంతీయ భాషలైన కొర్కు గోండి, మాడియ, ఖిలీ మొదలైన ఇతర భాషలు ఉండగా, ప్రధాన భాప్టైన మరాఠీ వాడుక- ప్రాంతాల రీత్యా చూస్తే, ఈ పాఠశాలలో బోధించే ఎక్కువ శాతం మంది ఉపాధ్యాయులు బయటివారే. వాస్తవంగా, ఈ పాఠశాలల్లో గిరిజన భాషలను నిర్మూలించారు. వారిలో ఒకరు ఇలా వ్యక్తపరిచారు: “లేకపొతే వాళ్ళు మరి మరాఠీని ఎలా నేర్చుకుంటారు.” వాదన ఒకటే, ఇంకా దాని ప్రభావమూ ఒకటే. చాలామంది గిరిజన విద్యార్థులు తమ తరగతిగదుల పాఠశాలల్లో సాధన చేసేటప్పుడు, వారి ఇంటి/ప్రాంతీయ భాషా ప్రయోగానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఈ ఆశ్రమశాలల్లో కొద్ది మంది, 1 - 2 తరగతుల ఉపాధ్యాయులు మాత్రమే పిల్లల ఇంటి భాషను మాట్లాడుతారు కాని, సీనియర్‌ ఉపాధ్యాయులు వాడరు. ఈ గిరిజన ప్రాంతాల బయట నుండి వచ్చే కొంత మంది ఉపాధ్యాయులు, ఈ భాషలను సంభాషణలలో నేర్చుకుని, తరగతిగదుల బయట గానీ, మైదానంలో గానీ లేక హాస్టల్లో గానీ వినియోగిస్తారు. ఇది ఎప్పుడూ కూడా తరగతి సంస్కృతిలో భాగం కాదు. ఇది ఎంతలా అంతర్లీనమైపోయిందంటే, కౌంత మంది గిరిజన ఉపాధ్యాయులు కూడా “మరాఠీలోనే మాట్లాడాలి" అనే అభ్యాసనకు కట్టుబడి ఉంటారు. సహజంగా పిల్లలు తరగతిగదుల్లో నిశ్శబ్దంగా ఉంటారు. వాళ్ళు మాట్లాడరు. దీని తరువాత పిల్లలు చచ్చీచెడీ అధిక శ్రమతో - పాఠ్యపుస్తకాలూ గైడ్ల నుండీ ఎక్కువగా ఆలోచనా రహితంగా కాపీ చేస్తుంటారు. రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాలలో విస్తరించి ఉన్న 371 ఆశ్రమ పాఠశాలల్లో, 66 పాఠశాలల యాదృచ్చిక నమూనా కోసం చేసిన అంతర్గత సర్వేలో, 15% మంది పిల్లలు తమ మరాఠీ సైన్సు పాఠ్యపుస్తకాన్నీ చదవలేరనీ మరియు ౩7% మంది చదవడానికి కష్టపడుతున్నారనీ మరియు కొన్ని భాగాలను మాత్రమే చదవగలరనీ మేము కనుగొన్నాము. ఈ విధంగా మరాఠీ సగం మంది స్థానిక గిరిజనపిల్లలను అర్దవంతమైన అవగాహన నుండి మినహాయిస్తోంది (పాఠశాలల ప్రాథమిక బేస్ లైన్‌ నివేదిక ఆధారంగా చేయబడిన ఫీల్డ్‌ వర్క్)

మహారాష్ట్రలోని ఆశ్రమ పాఠశాలలను ఎందుకు సెమీ మరాఠీ చేయకూడదు?

1 లేక 2 తరగతుల కోసం గిరిజన భాషలలో వాచకాలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నాలు జరిపింది, అయితే ఇది క్షేత్ర అవసరాలకు సరిపోలేదు. భాషా రాజకీయాలు కూడా ఇందులోకి చొచ్చుకొస్తున్నాయి. మరాఠీ నిష్ణాతులైన గిరిజన నేపథ్యం నుండి కొంత మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసుకుంటారు కానీ గిరిజన భాషలను ఎంచుకున్న ప్రధాన స్రవంతి ప్రాంతాల నుండి చాలా తక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటారు. ఎక్కడైజే పాఠ్యపుస్తకాలు మరాఠీలో ఉండి వివరణలూ, సంభాషణలూ ప్రాంతీయ గిరిజన భాషల్లో ఉంటాయో అవ్బడు సెమీ-మరాఠీ విధానం ప్రభావవంతంగా ఉంటుంది. ఉపాధ్యాయులు ద్విభాషులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తరగతిగది యొక్క మౌఖిక సంస్కృతి పిల్లల భాషలలో ఉండాలి. మరాఠీ భాష పరివర్తన చెందడానికి, అనువైన సేంద్రియ పద్దతిలొ ప్రణాళికను తయారుచేయవచ్చు. ఇది ఎలా సాధించాలో చూపించిన ఉపాధ్యాయుల ఉదాహరణలు చాలా అరుదుగా ఉన్నాయి. గిరిజన భాషల పట్ల తరగతిగది సంస్కృతి మారుతుంది. రాష్ట్రంలోని ప్రాంతాలలో కూడా సమృద్దమైన వైవిద్యం ఉంది. కౌత్త నియామకాలలో కనీసం ఒక్క గిరిజన భాషనైనా తీసుకోవాలనే నిబంధనను నొక్కి చెప్పడం ద్వారా ప్రారంభించవచ్చు. ప్రస్తుతం చిన్న దశలలో బోధిస్తున్న ఉపాధ్యాయుల కోసం, వారందరూ తమ పాఠశాల యొక్క సంబంధిత గిరిజన భాషలో పట్టు సాధించేలా

తెలుగుజాతి పత్రిక 'అమ్మనుడి * నవంబరు-2020

13