పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమ్మనుడితోనే

జె.డి.ప్రభాకర్

అందలం

8500227185


'దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం'

తెలుగు భాషవాడుక: సామాజిక భాషాశాస్త్ర అధ్యయనం

సామాజిక జీవనంలో నుండి జనీంచిందే భాష ఆది నుండి నేటి శాస్త్ర సాంకేతికతతో అభివృద్ది చెందుతూ ఆధునిక కాలం వరకు మనిషి సృజనాత్మతకు ముఖ్య ఉపకరణంగా భాష ఉంది. నాటి రాతి యుగం మనిషి నేటి రాకెట్టు ప్రయోగాల వరకు చేరుకున్నాడంటే తాను ప్రకృతిలోని విషయాలను, దాని జ్ఞానాన్ని సంగ్రహించి, అవనరాలకు అనుగుణంగా వస్తు ఉత్పత్తి చేస్తుండటమే కారణం. ఈ క్రమంలో, తాను సంగ్రహించిన జ్ఞానాన్ని ఇతరులకు అందించడంలో భాష ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ అభివృద్ది క్రమంలో సమాచార మార్పిడిలో భాష ఎంతగానో ఉపకరించింది అన్నది సుస్పష్టం. అంతేకాకుండా, వ్యక్తి శ్రమనూ సమయాన్నీ తగ్గించడంలో మాతృభాష తోడ్పాటునందిస్తుంది. జ్ఞానవాహినీగా, జ్ఞాన సృష్టికి మూలంగా పరిగణింపబడుతున్న భాష, ప్రతీ యుగంలోనూ మానవుడిని ప్రగతిదారిలో నడిపిస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మాతృభాషని ఒక ప్రత్యేక దృక్కొణంలో ఆర్జికసామర్ద్యాన్ని కలిగించే పనిముట్టుగానూ ఒక సామాజిక శక్తిగానూ పరిగణించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది (ఉమామహేశ్వరరావు, 2016).

మార్షాక్‌ (1965) భాషకు ఆర్థిక వ్యవహారాల సంబంధాన్నీ గుర్తిస్తూ, ఒక భాష మరొక భాష కంటే ఎందుకు ఎక్కువగా పరిగణించబడుతుంది? భాషా వ్యవహారం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? గతంలోలేక ప్రస్తుతం భాషల స్థితిగతులకు గల కారణాలు ఏమిటి? అనే ప్రశ్నలు లేవనెత్తుతూ భాషకు ఉన్న శక్తియుక్తులను ఆర్థిక కోణాన్నుంచి పరిశీలించాడు. సమాజ అభివృద్దికి కీలకమైన నిర్దాయక కారకాలలో భాష ముఖ్య భూమిక పోషిస్తుంది(ప్రభాకర్‌, 2016). ఉత్పత్తి కారకంగా ఉన్న భాష, శ్హ్రామికుల మాతృభాష అయితే అది అధిక ఉత్పత్తికి దారితీస్తుంది. ఈ పరిశోధనా పత్రం, ఉత్పత్తిలో భాష పాత్రను వివరిస్తూ, భాషకున్న విలువను తెలియజేన్తుంది. మాతృభాష ఆర్జిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తుందనీ చూపించడానీకి పనిస్థలాల్లో నుండి సమాచారాన్ని సేకరించడమైనది. 'శ్రమ-భాషా పెట్టుబడీ:

భాషను ఆర్దికవేత్తలు ఒక మానవ మూలధనంగా పరిగణిస్తారు (రేనాల్స్‌ మరియు మారియన్‌, 1972). ఈ సందర్భంలోనే "భాషలు సమాజంలోని ఆర్దిక లావాదేవీలను ప్రభావితం చేయటమేగాక, సమాజవు ఆర్జిత వ్యవస్థకు భాషే పునాది” అవుతుందని ఉమామహేశ్వరరావు(2017)అర్ధిక గణాంకాల ద్వారా నిరూపించారు. ఉత్పత్తికై పెట్టిన పెట్టుబడుల్లో భాష వాడుక కూడా పెట్టుబడిలో భాగమే. డబ్బూ యంత్రాలూ, వివిధ పనిముట్లూ వాటి శక్తిసామర్వాలూ పెట్టుబడిగా పెట్టిన తీరూ వీటికైన ప్రణాళికా భాషతోనే చేకూరుతాయి. ఏ భాష అయితే ఉత్పత్తికి తక్కువ సమయాన్ని తీసుకుంటుందో, పనికి కావలనీన మెరుగైన అవగాహన కల్పిస్తుందో ఆ భాషనే వాడటం సాధారణ సాంప్రదాయమే కాదు అవసరం కూడా. ఆ భాషనే ఒక సమాజపు శ్రమశక్తుల (కార్మికుల) భాషగా గుర్తించి భాషా ప్రణాళికను రూపొందించాలి. ఆ భాషనే పాఠశాల స్థాయినుండి శిక్షణా కేంద్రాల వరకు విద్యా మాధ్యమంగా వాడుతుండాలి.

మార్షాక్‌, (1965) ఒక భాష-విలువ, ప్రయోజనం, ఖర్చులూ ఇంకా లాభాలను కలిగి ఉంటుందని గుర్తించాడు. మానవ మూలధన సిద్దాంతం (Human Capital Theory) కార్మిక ఉత్పాదక శక్తిని సూచిస్తుంది, ఇది ఇతర భౌతిక పెట్టుబడుల నుండి వేరుగా ఉంటుంది. ఇది ఆదాయంలో వ్యత్యాసాలను వివరించడానికి అతి ముఖ్యమైన పరికరంగా పనిచేస్తుంది. (బెకర్‌, 1975: రైడర్‌ -పోన్స్‌-రైడ్లర్‌, 1986:రాబిన్సన్‌, 1988). శ్రామికులు పనిస్థలాల్లో పని చేసినప్పుడు, వారు విషయావగాహన కొరకూ, పనిస్థానాలలో తోటివారితో సంభాషించడానికీ భాషని ఉపయోగిస్తారు. వ్యక్తి ఖర్చుచేసే సమయం, వాడుతున్న భాష, ఉపయోగించే శక్తి కలిగివున్న నైపుణ్యాలను వినియోగించటం మానవ మూలథనంగా పరిగణింపబడుతుంది (ప్రభాకర్‌ 2016). రేనాల్డ్‌ ఇంకా మారియన్‌ (1972) ఆర్ధికవేత్తలు భాషనీ మానవ మూలధనంగా గుర్తించారు. ఈ పద్ధతిలో భాషాజ్ఞానం కూడా విద్య వలన వచ్చే ఫలితాలను రాబడుతుంది. తర్వాత ఇదే ఆలోచనా ధోరణి బైటన్‌ మరియ మిస్పోకోవ్న్కి (1975)చే కొనసాగించబడి, భాషా సమూహాల మధ్య నైపుణ్యాల తేడాను, వాటిపై ఉన్న సామాజిక ఆర్ధిక ప్రభావాలను చూపిస్తూ మాతృభాష విశిష్టతను చూపించడం జరిగింది. వివిధ ఆర్థిక సంబంధాలలో భాష కావాల్చిన ఇతర నైపుణ్యాలను పెంచుతుంది. అందువలన, భాష మానవ మూలధనంలో భాగమవుతుంది. కొంతమంది పరిశోధకులు (బ్రెటన్‌, 1978:వాలియన్మోర్డ్‌, 1980: గ్రైనియర్‌, 1982)ఒక భాష నేర్చుకోవడం అనేది మానవ మూలధనం యొక్క పెట్టుబడిలో భాగంగా పరిగణించారు. భాషలకు వాణిజ్యపరమైన సామర్థ్యం

తెలుగుజాతి పత్రిక 'అమ్మనుడీ * నవంబరు-2020

15