పుట:ధనాభిరామము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

ములో చెప్పినాఁడు. భైరవకవి క్రీ. శ. 1440 ప్రాంతము వాఁడు. కాఁబట్టి నూతనకవి సూరనయు, క్రీ. శ. 1450 ప్రాంతమువాఁడనియు పూర్వకవులలో నొకఁడనియు నిశ్చయింప వచ్చును.

గ్రంథవిషయము

ఈ గ్రంథము దాక్షారామభీమేశ్వరునికిఁగృతి. ఇందలికథ గతానుగతికమగు ప్రబంధకథగాక, మానవజీవితముతో సంబంధించినది. మనుష్యునకు రూపము ధనము రెండును నావశ్యకములే యని యిది నిరూపించును. కథసారాంశ మిది “రూపము హెచ్చని మన్మథుఁడును, ధనము హెచ్చని కుబేరుఁడును వాదించి, దాక్షారామక్షేత్రమునఁ దమవాదముల నెగ్గించుకొనుటకు వచ్చిరి. అచ్చట రూపమువల్ల మన్మథుడు స్వాధీనపఱచుకొన్న స్త్రీని, ధనమువల్ల కుబేరుఁడు స్వాధీనపఱచుకొనెను. అంతమన్మథుఁడు భీమేశ్వరునిఁ బ్రార్థింపగా నాతఁడు ప్రత్యక్షమై మానవులకు ధనము రూపము రెండును నావశ్యకములే యని సమాధానపఱచి, వారివాదమును మాన్పెను.” కావున నీకృతి కేవలసాంఘికవృత్తమునకు సంబంధించిన ప్రబంధమనియు, నిట్టి గ్రంథములు మనభాషావాఙ్మయములో కొలఁదిగామాత్రమే యున్నవనియు, నిదియే యీప్రబంధప్రాశస్త్యమనియు నెఱుఁగఁ దగియున్నది.