పుట:ధనాభిరామము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

పైకవులలో నీతనికి ముందున్నవారిలో నాచనసోమయమరేశ్వరులు చివరివారు. ఈకాలము క్రీ. శ. 1360 ప్రాంతము. కావున సూరనయు నాతరువాతికాలమువాఁడని మాత్ర మీకవిస్తుతి తెలుపును. ఇక, క్రీ. శ. 1550 ప్రాంతము వఱకుఁగల కవుల గ్రంథములనుండి పద్యములు సంధానింపబడిన జగ్గన ప్రబంధరత్నాకరములో, సూరన ధనాభిరామమునుండి యీ క్రిందిపద్య ముదాహరింపఁబడినది. [1]

చ. ఇరువదియాఱువీక్షణము లెన్నఁగ నాలుగువక్ర చేష్టలిం
    పరుదుగ నేడు భ్రూనటన లర్వదినాలుగు దోర్విలాసముల్
    సరసతఁ జూపి హంసవృషసామజవాయసశుద్ధసంగతుల్
    పరువడి ముట్ట నిల్పె సితపంకజలోచన పాడుచుండఁగన్.

ఇది రెండవయాశ్వాసమున 46-వ పద్యముగాఁ గొలదిమార్పుతో నీగ్రంథమందే యున్నది. కాఁబట్టి నూతనకవి సూరన క్రీ. శ. 1360–1550 మధ్యవాఁడని మనకుఁ దెలియుచున్నది. ఇంతకంటె స్పష్టముగా నిర్ణయముచేయుటకు వేఱొక యాధారము గలదు. సూరనకవిత్వమును శ్రీ వీరభద్రగురుకటాక్షముచే

గ్రహించినాఁడు. ఈవీరభద్రగురుఁడు ముదిగొండ వీరభద్రుఁడు, రత్నశాస్త్రమును రచియించిన భైరవకవి “ముదిగొండ శ్రీవీరేశునకు భక్తచింతామణికిన్" అని యాగ్రంథ

  1. చూ. ప్రబంధరత్నావళి - 482 పద్యము. 141 పుట.