పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

ద్విపద భారతము


రహి తూలఁ గానంగ రంగభోగముల
మహిమ వాసిన దేవమందిరంబులును,
రత్నదర్పణవిభారహితంబులైన
[1]నూత్నసమగ్రమందురగోపురములు,
హారి దుకూలధ్వజావళి లేక
సారంబులెడలు ప్రాసాదపంక్తులును,
లాలితనర్తకీలాస్యంబు లుడిగి
డాలఱియున్న నాటకగేహములును,
బ్రచుర[2]వధూరత్నభాస్వద్విలాస
రుచిహీనమైన శిరోగృహంబులును,
లలనాకటాక్షలీలావలోకముల
తళుకులు లేని వాతాయనంబులును,
మిడుకమానిసి లేమి మిగులఁ బాడొంది
యడరి దయ్యాలు కొట్లాడు వీథులును
గలిగి, దగ్ధపటంబుకైవడిఁ దోపఁ
బొలుపేదియున్న యాపురము వీక్షించి:
'కటకట! తపసి తెక్కలివిధి యగుచు
నిటు చేసెనే!' యని యెంతయుఁ బొగిలి,
కరి డిగ్గి, దివిజసంఘము నెల్లఁ జూచి,
వరుసతో 'నిచ్చోట వసియింపుఁ ' డనుచు
బలుకుచు నగరిలోపలి కొయ్య నేఁగి,
కలయంగ నలుదెస ల్గనుగొనునపుడు,
పూని రథంబు లద్భుతముగాఁ బోయె;
ధేనువు మొదలనె దీపింపదయ్యె;
నటుపోవ నెల్లచో నలపడియుండు
పటుదివ్యరత్నముల్ భాసిల్లవయ్యె;
మఱియును జనిచూడ మాయంబులైరి

మెఱయు రంభోర్వశీమేనకాదులును.
  1. ధూత్న
  2. వధూతరభాసవిలాస (మూ)