పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము

27


“నెనసి క్రాలినవహ్ని నెగఁదోయు భంగిఁ
 బెనఁగొని నటనట ప్రియము సేయకుము
 ఈ[1]వట్టిమాటలకెల్లను గరుణ
 యే వెంట నామది నేల జనించుఁ!
 జూలుఁబోచాలు! నిచ్చలుఁ బనిలేని
 జోలిమాటలును మెచ్చులుగావు మాకు.
 ఇంక నొండాడిన నిప్పుడు గడమ
 కొంకులుమాని [2]నీగుఱుతు మాయింతు;
 వలవదు తల;" మని నగి మూర్ఖవృత్తిఁ
 బలుకుచు నామౌనిపతి వేగఁ జనియె.

అమరలోకపతనము

అప్పుడు దేవేంద్రుఁ డాత్మలో శోక
ముప్పతిల్లఁగ, దైన్య మొదవ నాస్యమున,
సకలనిర్జరసైన్యసమితియుఁ, దానుఁ
జకితమనస్కుడై చయ్యన మగుడి
 యమరావతికి నేఁగునప్పుడు, పురము
 కొమరేది దూర్వాసుకుటిలవాక్యముల
 వరుసఁ జెప్పఁగఁ జూప వాక్రువ్వరాని
 పరుసున నెంతయుఁ బాడొందెఁజూడ.
 సురుచిరసురభూజశూన్యంబులైన
 పురబాహ్యభాగవిస్ఫుటవనంబులును,
 వరహేమసన్మణివజ్రముల్ లేని
 గురునగరద్వారగోపురంబులును,
 సరవి నందంద రక్షకకోటి లేక
 యరయంగ [3]నాఱడియైన వాకిళులు,

  1. వెట్టి
  2. గుఱంత
  3. బారడి (మూ)