పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/691

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

625


దగఁ బఠింపుచు నేఁగె ధౌమ్యుండు వడిని
దెగువతో " ననవుడు ధృతరాష్ట్రవిభుఁడు
శోకించి విదురునిఁజూచి యిట్లనియె:
"భీకరశౌర్యులు పృథివీశసుతులు
పాండ వేయులు జగత్ప్రఖ్యాతయతులు
చండాంశు తేజులు సజ్జనోత్తములు ;
వారలతోడ దుర్వారవైరంబు
కౌరవేశ్వరునకుఁ గడుసమకూరె;
ఎంత చెప్పిననైన నెఱుఁగఁడు ; బుద్ధి
మంతుఁడుగాఁడు దుర్మదుఁడునాకొడుకు ;
కడఁగి మీఁదను బ్రజాక్షయముగాఁగలదు
పుడమిపై." నని భయంబునుబొంది మిగుల
వెచ్చనూర్చుచు మనోవికలుఁడై యుండ,
నచ్చట సంజయుఁ డారాజుకనియె:
'పాండవేయులు ధర్మపరులనియెఱిఁగి-
యుండియుఁ దోలించితుర్విఁ [1]గానలకు ;
చేకొంటివీవ యీసృప్టీతలంబు ;
నీకును వగవంగ నిరతంబునేల!
కలశజ విదుర గంగాతనూభవుల
పలుకులు వినవైతి పరమార్థముగను ;
కర్ణ గాంధారులకఱపులు వినుచు
దుర్ణీతివంతుఁడై దుర్యోధనుండు
పగయయ్యెఁ గలశజ [2]ప్రముఖయోధులకు ;
మగఁటిమిఁ బాండుకుమారులతోడఁ
దొడరుఁగా కేమి పొందుగ నీసుతుండు,
తడయక యింక నీతనయుండు దక్క

  1. వారలను.
  2. ప్రకర. (మూ)