పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/679

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

613


అనవిని ధృతరాష్ట్రుఁ డతివ పాంచాలి
ఘనగుణంబులకును గడుసంతసిల్లి
పాండవాగ్రణిఁజూచి భక్తినిట్లనియె :
“దండితో నీవు నీతమ్ములుఁ గూడి
లాలిత సామ్రాజ్యలక్ష్ములయందుఁ
జాలభోగింపుఁడు సంతోషమునను ;
మునుపటియట్ల భూములవాని గొలువ
దనరంగ నేలుఁ డింద్రప్రస్థపురము.
ఎఱుఁగుదు ధర్మంబులెల్లను నీవు ;
కఱటినాతనయుండు కలుషమిత్తుండు
నీకుఁజేసినయెగ్గు నెఱయంగ మరువు;
లోకంబులో గుణశ్లోకులు ఘనులు
కైకొన రధములకష్టభాషలు ;
చేకొని మన్నింపు చెనఁటినాసుతుని.
ఏను బుద్ధులుదప్పి యిట్టిజూదంబు
పూనికావించితిఁ బుణ్యహీనుఁడను ;
గావున, నను వింతగాఁజూడవలదు;
పావనాచార, సౌభాగ్యసంభరిత,
మీతల్లి గాంధారిమిక్కిలిదలఁచి
[1]మాతలంపులెఱింగి మన్ననల్ చేసి,
దుర్యోధనాదుల దుర్గుణావళులఁ
గార్యముల్ గావని గైకొనవలదు.
విదురుఁడు మంత్రిగా వెలసిధర్మములఁ
బొదలినయట్టిసత్పుణ్యాధికుఁడవు.
కురుకులనిజరక్షకుండవుగాఁగ
సరవి మేలుగను రాజ్యముసేయఁదగుదు."

  1. మాతలం పెఱింగి మన్ననల సేవించి. (మూ)