పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/680

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

614

ద్విపద భారతము.


వని ధర్మజునినంప, హర్షంబుతోడఁ
గనకలతాతన్వి కాంత ద్రౌపదియుఁ
బురుషసింహముల నప్పుడు దనపతుల
నరుదుగా శాంతుల నందందచేసె.
ఆవేళ భీముండు నన్నకిట్లనియె:
"వావిరి ద్రుపదభూవరతనూభవను
అవమానమొనరించినట్టిశాత్రపుల
బవరంబులోపల భంజించి నిన్ను
నేలింతు ధర [1]యబ్ధియెల్లగా. " ననుచు
ఫాలాక్షశౌర్యసంపద మించియుండె.
మృగమధ్యముననున్న మృగరాజుభంగిఁ
దగసహోదరుల మధ్యంబుననున్న
యనిలతనూభవు నపుడువారించి
ఘనుఁడు ధర్మజుఁడు వేడ్కనునిట్టులనియె :
"ఎంతతప్పునకైన నీ వేళ నోర్చి
యెంతయు మీఁదటనేచి శాత్రవులఁ
దునుముద. " మనుచు బుద్ధులు చాలఁజెప్పె.
కనకరథములెక్కి కాంతయుఁ దారుఁ
బోయి యింద్రప్రస్థపురవరంబునను
బాయక సకలసంపదల నుండుటయు,
నాతఱిఁ గురురాజు నాదుస్ససేను-
చేత వృత్తాంతంబు చెనసి తా వినుచుఁ
దవనజ శకునిసైంధవులతోడుతను
నిపుణతఁదలపోసి నిశ్చయంబుగను
ధృతరాష్ట్రుకడకేఁగి తెలివినిట్లనియె :
"[2]ప్రతిభటావళి నెన్నిభంగులనైన

  1. యెల్ల.
  2. ధృతి. (మూ)