పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

591


ధృతరాష్ట్రుఁడును సభదిక్కున రవము
నతిభంగి విదురుని నడిగె గ్రక్కునను:
"ఎవ్వ రేమివిధంబు లిటయోడి పిదప
నెవ్వరోడిరి ? నాకునెఱిఁగింపు.” మనిన
నన్నరపతితోడ నతఁడిట్టులనియె:
“నన్న, యీశకుని మాయాద్యూతమునను
సకలార్థములునోడె శమననందనుఁడు,
[1]వికలులై పాండుభూవిభుతనూభవులు
దీనతనున్నారు తెలివిలేకిపుడు
మానుగా.." ననుచుఁ గ్రమ్మనచెప్పుచుండ
నా వేళఁ గురుపతి హర్షంబుతోడఁ
బావనమతులైన పాండు [2]నినుతుల
దాసులగాగెల్చి తారతమ్యంబు
వాసి దలంచక వరుసనిట్లనియె:
"వరవుళ్లఁగలిసి నివాసంబుదుడువఁ
దరళాక్షిఁ దన్వంగి ద్రౌపదినిపుడు
వేగంబె తో తెమ్ము విదుర, నీ.” వనిన
నాగుణాంభోరాశి యతనికిట్లనియె:
"నీనిష్ఠురతకును నీపాపమునకుఁ
గానంగఁజాలుదు కష్టవర్తనము ;
దుర్జనుండవు మహాదురితదేహుఁడవు
వర్జించు నిన్ను నైశ్వర్యంబు ; మీఁదఁ
జెడుదువు నీవును సిద్ధంబుగాను.
పుడమియేలెడు పాండుపుత్రుల సాధ్వి
యగుద్రౌపదిని నేలయవమానమిపుడు
తెగువఁ జేసెదవు ధాత్రీశులుదిట్ట !

  1. వికలవ్యులై.
  2. భూపతుల. (మూ)