పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

592

ద్విపద భారతము.


పాండవేయులలక్ష్మి పరఁగఁగైకొంటి
దుండగంబున నృపస్తోమంబు నగఁగ.
ప్రకటంబుగా నిట్టిపాపస్వభావు
శకునిమాటలు వినఁజనునె నీకెందు!
ఈజూదమున నీకు నెగ్గులుపుట్టు
నీజగంబున. ” నన్న నేచి యంతటను
దుర్యోధనుఁడు మహాదుర్మదాంధుండు
కార్యజ్ఞుఁడగు ప్రాతికామికిట్లనియె:

ద్రౌపదినిఁదోడ్తేర దుర్యోధనుఁడు ప్రాతికామినంపుట

“విదురుఁడెప్పుడు పాండవేయులమెచ్చి
మొదలనుండియుఁ బక్షమునఁజరియించు;
వెఱచు; నీవేఁగి యా వెలఁది ద్రౌపదినిఁ
దఱితోడఁ దో తెమ్ము తడయక. " యనినఁ
బ్రాతికామేఁగి ద్రౌపదికినిట్లనియె:
“నాతి, నీపతి ధర్మనందనుఁ డిపుడు
ధార్తరాష్ట్రునకు జూదంబాడి మిగుల
మూర్తిశోషిల్లఁ దమ్ములఁ దన్ను నిన్ను
సర్వార్థముల నోడె జగమెల్లనెఱుఁగ.
దుర్వివేకమున నాదుర్యోధనుండు
నిన్నుదో డ్తెమ్మని నిష్ఠురత్వమున
నన్ను బుత్తెంచెను [1]నడుఁకక రమ్ము."
అనుటయుఁ బాంచాలి యతనికిట్లనియె:
"మునుకొని యేయుగంబులయందునైన
భార్యనోడినయట్టిభర్త దాఁగలఁడె !
యూర్యోక్తిగానియీయాలాపమిపుడు

  1. నడుగక. (మూ)