పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/653

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

587


నైజంబుగాదె నానా ప్రకారమున !
భూజననుత, నాకు బుద్ధులేమియును
జెప్పకుండుము నుతిచేసెద నిన్ను ;
నెప్పుడు ధర్మజుహితమిగోరుదువు."
అనుసుయోధనునకు విఁదురుఁడు
కనలి యిట్లనియెను గడిమిదూషించి :
"చెడుబుద్ది నీకునుజెప్పెడివారి
నెడమాటలే వినవేఱుకగాక,
మీయట్టివారలమాటలు వినఁగ
నీయట్టివారలు నేర్తు రే యెందు !
కొంకక నీయట్టిగుణహీనునకును
బింకపుమాటలే ప్రియాయులై యుండు ;
నీకుఁబ్రియంబుగా నెరవై నమాట
నాకునాడఁగ రాదు న్యాయంబుమాని.
పగగొని తమతోడ బలములఁగూర్చి
తెగి తేజమునఁబోరి ధీరులసిరులు
రాజులు జయమునరప్పింతురెందుఁ
దేజంబుఁ గీర్తియు ధృతియును మిగుల.
నాతలనెవ్వరు నగకుండ రాజ,
నీతిచెప్పితి నిదినీకింపుగాదు;
పథ్యంబుగాఁగొనరు పాపమానసులు
తథ్యంబుగా సభ్యతతులు పల్కి నను.
ప్రియభాషణములన ప్రియము సేయుదురు
నయవివర్జితులు [1]వినాశ కాయువులు.
కాన సజ్జనులు దుస్కార్యవంతులకు
నేనాఁటఁ జెప్పరు హితబుద్ధులెల్ల.

  1. క్షీణాయుష్కులనునర్థములో నపశబ్దముఁ బ్రయోగించియుండును.