పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

586

ద్విపద భారతము.



విదురుఁడు దుర్యోధనుని దూషించుట

తోడనే పలికె నుద్ధురరౌద్రమునను :
"ఓడక దుష్కీర్తికొడిగట్టినట్టి
పాతకుండపు ; గుణప్రకటశూన్యుఁడవు ;
నీతిదూరుండవు నిందితాత్ముఁడవు ;
అన్యాయమున జూదమాడెద వేల !
మాన్యులు బుధశిరోమణులు దూషింప.
ప్రకటసౌబలుని మాయాద్యూతమునను
సకలభూపాలైకచక్రేశులైన
పాండుకుమారుల బహుళసంపదలు
దుండగంబున నీవు తొలుతగై కొనిన
నవ్వరా నిన్ను నానాజనంబులును !
మవ్వమిగా. " నన్న మఱి సుయోధనుఁడు
విదురునకలిగి యావేళ నిట్లనియె:
"ఎదిరితలంపు నీ వెఱుఁగవేమియును;
బరులగుణంబులు పలుమాఱు నీవు
వరుసఁ గీర్తింతువు వాచానురక్తిఁ ;
బరఁగ పాండవపక్షపాతివి; కపట
నిరతుండవై మహానిష్ఠురత్వమునఁ
గుడిచినయింటి కే కుఱుచదలంచి
యెడపక దోషంబు లెపుడుఁ జేసెదవు;
[1]క్రూరోరగముభంగిఁ గొసరక నీవు
ఆరయఁగా విఘ్నమాచరించెదవు;
పరులసంపద సుఖో పాయంబునందు
వెరవారఁ గొనుట భూవిభులకునెల్ల

  1. ఉత్సంగతలమునం దుగ్రవిషోరగంబున్నట్లు నీవు మాయొద్దనునికి. అని నన్నయ.