పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/654

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

588

ద్విపద భారతము.


మొదల నప్రియములై మునుకొనితోచి
తుదిఁ [1]బ్రియంబులగు హితఁ భూషణములు.
తరువులెక్కంగను దావలు వలయుఁ ;
దెరలక నదులీఁదఁ దెప్పలువాయు. ;
నమరులకైన సహాయంబువలయు
రమణనొండొరులకు [2] రాజతంత్రముల.
ఎంతబుద్ధులు నీకు నెలమిఁజెప్పినను
నంతయు నీకును నప్రియంబయ్యె.
చిత్రయశుండు విచిత్రవీర్యునకుఁ
బుత్త్రుండ నీతివిస్ఫురితశీలుఁడను;
నన్న నాదరము మిన్నక చేసి కినిసి
యెన్నిదుర్భాషణ లెగసియాడితివి !
తరమెఱుఁగక పాండుతనయులతోడ
దొరయని జగడంబు తుదిఁ జేసుకొంటి.
బ్రదుకుదుగా కేమి ప్రాణంబుతోడఁ ;
గొదలేదు నీబుద్ధి కుంభినియందు."
అనివిదురుడు వికలా నుండగుచు
జననాయకుని సభాస్థలినుండుతఱిని,
శకుని ధర్మజునితో సరవినిట్లనియె :
"సకలసంపదలును సరవి నోడితివి;
రాజశేఖర, ధర్మరాజ, రాజాధి
రాజ, రాజశశాంక, రాజామరేశ,
యింక నేమిటినొడ్డి యిపుడు జూదంబు
శంకింపకాడుదు సంభ్రమంబునను ? "
అనిన ధర్మతనూజుఁ డవనీతలంబు
తనరంగనొడ్డి యాతనితోడ ననియె:

  1. ప్రియంబై యుండు దూషభాషణలు.
  2. రాజితతతులు. (మూ)