పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

499


బ్రహ్మదత్త విశాల బల పృషదశ్వ
బ్రహ్మ మహాదర్శ భవ్యశంతనులుఁ,
బుణ్యభూరిద్యుమ్న బుధమన్మథులును,
[1]గణ్యసన్మధురోపకంరాధిపతులుఁ,
జండశౌర్యుఁడు భవజ్జనకుఁడైనట్టి
పాండురా జాదిగాఁ బరఁగు భూపతులు
సేవింప నాసభ చిత్రమైయొప్పు;
భావించి యముఁడును బాపపుణ్యముల
నరయుచుండును బ్రాణులందు నెప్పుడును.

వరుణసభావర్ణనము

వరుణదేవునిసభ వరవిచిత్రముల
గురుతరంబైయొప్పుఁ గొమరార; యముని
నిరుపమసభయంతనిడుపు వెడల్పుఁ
గలిగియుండఁగ విశ్వకర్మసృజించెఁ.
జెలఁగి యందును సుఖాసీనుఁడై యుండు
వరుణుఁడు దేవితో; వారిరాసులును,
[2]గరమొప్పుచున్నట్టి కాళింది కృష్ణ
గౌతమి నర్మద కావేరి పెన్న
పూతసరస్వతి పుణ్యవాహినులు,
ఘనసరోవర తటాకములును, గిరులు,
వనములు, వసుమతి, వరకూర్మ మకర
ఘోర నక్ర గ్రాహ గురుసింహ శరభ
వారణవ్యాఘ్రాది వరజలచరులు, (?)

  1. మధుకంఠోపరిచరులును . అని, నన్నయ.
  2. నదులును ననుమతియు మూర్తివంతములై, జలచరస్థలచరములగు కూర్మ...
    సింహాదిజంతువులతో వరుణునిసభఁ గొల్చుచుండు. అని నన్నయ.