పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

500

ద్విపద భారతము.


శేష వాసుకి ఫణశ్రేష్ఠులు, గాఢ
దోషాచరుల్, ఖగస్తోమంబుఁ గొలువఁ
జదురొప్పు వరుణుని సభ యెల్లవేళ,

కు బే ర స భా వ ర్ణ న ము

తదనంతరంబ యాధనదుని సభయు
నింద్రునిసభతోడనెనయగుచుండు;
సాంద్రవైభవములఁ జాలనొప్పొర
నది విశ్వకర్మ నేర్పలర సృజించె,
విదితంబుగా నందు వెసఁ గుబేరుండు
కొలువుండు మందార గురుపారిజాత
మలయానిలానంద మహనీయుఁడగుచు.
ననవరతంబుఁ దన్నచట గిన్నరులు,
ఘనులుగంధర్వులుఁ, గలితవరాహ
కర్ణ సన్మదగజకర్ణులు నీల
వర్ణులు,సన్మునీశ్వరులును, బుధులు,
[1]మదకాలకంఠ సన్మణిభద్ర హేమ
విదితనేత్రులును బవిత్రధన్యులును,
నలకూబరుండు నున్నతిభజియింప,
రంభయు మేనక రమణియూర్వశియు
నంభోజవదనఘృతాచి తిలోత్త
మాదిదేవస్త్రీలహర్నిశంబొప్పు
మోదంబుతోఁ గొల్వ, ముఖ్యభోగముల
నుండును దేవితో నొగిఁగుబేరుండు.

బ్ర హ్మ స భా వ ర్ణ న ము

మఱియును విను, మహీమండలంబునకు
నఱుడు చెప్పఁగవిన నాబ్రహ్మసభను.

  1. మాణిభద్రహేమనేత్రులు. అని నన్నయ, నామవాచకముల ఆదిని మధ్యను ఉప
    పదములఁజేర్చుట వింత.