పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

498

ద్విపద భారతము


సతులుగొల్వఁగ, విభూషణ వస్త్ర గంధ
యుతుఁడై శచీదేవి నొనరంగఁగూడి
యభిరామముననుండు ననిశంబుఁ గొలువు.
అభిముఖులై యాజినడఁగు శూరులును,
గ్రతువులు వేదోక్తిఁగావించునట్టి
క్షితిదేవులును నింద్రుఁ జేరియుండుదురు.
గురుఁడు శుక్రుండును గురుపవిత్రమునఁ
జిరకాల మొప్పు [1]నగ్నిష్టోమములును,
శ్రీతనులైన విశ్వేదేవతలును,
ధాతవిధాతలుఁ, దగు హరిశ్చంద్ర
ధరణీశ్వరుండును దగ్గఱి శక్ర
వరసభాస్థలియందు వరుస నుండుదురు.

యమసభావర్ణనము

మఱి కృతాంతుని సభామందిరంబొండు
వెఱవార రచియించె విశ్వకర్మయును ;
అది శతయోజనంబైనఁవెడల్పు
బొడవునంతియ నిడుపునుజాలఁగలిగి,
కామగామిత్వంబుఁ గమలాప్తదీప్తి
హేమమాణిక్య సమిద్ధదీధితుల
నతిరమ్యమైయొప్పు; నాసభయందుఁ
దతితో నగస్త్య మతంగాది సిద్ధ
గణములు, భీకర కాలకింకరులు,
గణుతింపఁ గాలచక్ర క్రతు దక్షి
ణాధిదేవతలును, నాకృతవీర్య
మేదినీశుఁడు, జనమేజయ జనక

  1. అగ్నిసోములని నన్నయ. వ్యా. భా. లో 'అగ్నిష్టోమః, ' అని పా. అం.