పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

472

ద్విపద భారతము


వర చంప కాంభోజ వకుళ మల్లికలు
దిరిసెంబు గ్రోవి మోదెనయును బూచె;
[1] యువతిపాంథుల తల్పయోగంబుపోలె
దివసంబుల ఫలిత [2] దీర్ఘోష్ణమయ్యె ,
అట్టి వేసవియందు హరియు నర్జునుఁడు
దిట్టలై యమునానదీ తీరభూమి
విహరింప, నొక వృద్ధవిప్రుడై కదిసి
దహనుండు వారినిద్దఱను వీక్షించి :
దీపనంబయ్యెడుఁదృప్తిగా నశన
....పుదురే మాకునొసగ మీ" రనిన
వా: రోపుదుము నీగు వాంఛయె?" ట్లనినఁ,
బాఱుఁడిట్లనె: వహ్ని, బ్రభులార, యేను;
నూతన ధనశక్తి నూఱేండ్ల క్రతువు
శ్వేతకియను రాజు నేయంగఁదలఁచి,
హోతలఁ దర్కింపనోపక పోయి
"శ్వేతాద్రిఁదపమున్న , శివుఁడంతఁగదిసి :
"నీతలం పెఱిఁగితి నృప, [3] సత్రయాగ-
హోతలఁగోరితి వొకటిచెప్పెదను.
గారాముతో నేయి కరికరాకార-
ధారఁ బండ్రెండేండ్లు దహనులోఁ దొలుతఁ
దొరఁగింపు; మందుఁదోతుర హోత." లనిన,
హరుని వీడ్కొనివచ్చి యతఁడట్లుచేసి
హోతలఁబుట్టించి, యొగివారుఁదాను
జాతిగా నూఱేండ్లు జన్నంబు సేయ,
నఱుగమిపుట్టి యే నజుఁగానఁబోయి,
యెఱిగించి దీనికి నదిమందనిన:

  1. పాంథయువతులని కవి ఆశయముగాఁబోలు. ఈ వేసవివర్ణనమందలి అర్థము
    అంత విస్పష్టముగా లేదు.
  2. దీర్ఘోష్ణమగుచు.
  3. సత్వ. (మూ)