పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

471


భూపాలగృహములఁ బుత్రోత్సవంబు
దీపించె ధర్మవృద్ధికి మూలమగుచు.
అక్కడ దుర్యోధనాదులు గనిరి
[1] లక్కనుఁడాదిగా లలిఁగుమారులను.
అంత, వేసవికాల మఖిలజీవులకు
సంతాపభయము నసౌఖ్యంబుగలుగఁ
దవిలినఁ, దమవేఁడి తారోర్వలేక
రవికిరణములు నీరముద్రావననఁగ
మనుజిక్కి చెఱువులు మడుఁగులు నూతు
లనువారనేళ్లు నొయ్యన రిత్తలయ్యె;
[2]ఆటలతోఁటల నలులపాటలును
బాటలపవనంబుఁ బలుమాఱు వీచెఁ;
గరములదోసిళ్లఁ గమలమునదులు
గరులు సంధ్యలువార్చుగతిఁ జల్లుకొనియె;
మిక్కిలి [3]పులివోలె మృగతృష్ణగలిగి
యెక్కడఁగదలిపోనీయదు దినము;
పావకుం డచలంబుప్రక్కలు చూడ
జేవురించుచు ఱాలచేఁజెట్లుపడియె;
నెమకి వీసంబంతనీడగల్గినను,
నెమరుపెట్టుచు నిర్లునిలుచు నచ్చోట;
పగలు క్రాగిన నేలఁ బావకోదయము
తగునన సూర్యకాంతంబులుమండె;
కమలాప్తుఁడయ్యును గమలాకరముల
కమలంబు రవిగ్రోలి కమలారియయ్యె;
ఛాయఁబాయక [4]నిల్చు సవితృఁడన్నట్లు
ఛాయాప్రియంబయ్యె జగతిజీవంబు; (?)

  1. లక్ష్మణపదమునకు వికృతి
  2. అటులతికలనలులబాధలను
  3. పురినోలె
  4. గెల్చె (మూ)