పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

459


కామినీజనులకాంక్షలు [1] వృథగాఁగ
నేమిటికిట్లయ్యె నీయయ్యగారు!
ఒకపాటి సతినేల [2]నొల్లఁడుగాన,
సకలంబుఁజాలించి సన్యాసి యయ్య.
ఇతఁడు కాంతలనేల కిట్లయ్యెఁగాని,
మతినిల్వనేర్చునే! మనబోఁటులకును;
ననుజూచి యేమొకో! నయనమల్లార్చె;
ననుమాన మీరాత్రి యడిగి చూచెదను."
అనుచు నందఱు మ్రొక్కినట్లె తామ్రొక్కి,
పెనఁగొన్నలజ్జ నా ప్రియునిఁ బూజించి,
సఖులకు మున్నాడిచనిన, నత్తెఱఁగు
ముఖసంజ్ఞ నరునకు మురవైరిచూపె.
బలుఁడంత నర్జునుభవ్యతేజమును
దలయూఁచి మెచ్చి యాతనికినిట్లనియె:
"అనఘ, మాపురమున నైదారు నెలలు
గొనవచ్చునే పూజఁ! గొన వసియింపఁ
గన్యకాపూర్వంబు గదిసి మీసేవ
కన్యసేయు సుభద్ర కణఁకమాయాజ్ఞ;
మృదువచోరచనల మీతోడిగోష్ఠి
సుదినంబులగు మాకు శుద్ధాంతరంగ!"
అనిన, నంతయుఁ బార్థుఁ డంగీకరించి
చనుదెంచె యాదవసదనంబునకును.
బలుఁడును నిజవాక్యఫణితిని యతికిఁ
జెలియలిచే నిత్యసేవ చేయించె
అంత, వర్షాకాలమైన మేఘములు
చింతింపఁ దగవువచ్చినయట్లు కూడి,

  1. వృథగావు
  2. నొల్లనొల్లఁడు (మూ)