పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/524

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

458

ద్విపద భారతము


జాడెలుపాడుచుఁ జాలఁగోలాట
మాడుచు గుంపులై యరుదెంచువారు,
సతులుఁ బుత్త్రులు బంధుసఖులునేతేర
వ్రతములు చెల్లించువారునై యిట్లు
జాతరవెడలుచోఁ, జాలఁగైసేసి
ప్రీతినుద్ధవుఁడును, బెరయనాహుకుఁడు,
ననిరుద్ధ సారణ హార్దిక్య గదులు,
శిని పౌండ్ర రామ సుషేణ బాణులును,
బ్రద్యుమ్న సాంబాది బహుకుమారకులు
నుద్యోగ[1]వంతులై యొదవిరి హరికి.
ఈ తెఱంగునఁబోయి యిందఱు గిరికి
జాతర శూలివెచ్చఁగ నాచరించి,
యింద్రనందనుఁడున్న యేకాంతసీమఁ
జంద్రకాంతోపలస్థలులు చేరుటయు,
బలభద్రుఁడంత సుభద్రఁ దోకొనుచు
వెలయ నచ్చటికేఁగి వెన్నునియెదుట
నతివకై వచ్చిన యతివేషధారి
నతిభక్తి నీక్షించి, యందంద మ్రొక్కి
యడుగులు పూజించి యర్ఘ్యంబులిచ్చి
యడరికీర్తింప, నయ్యవనరంబునను
భావంబుకంపింపఁ బడఁతిసుభద్ర
యావేషధారికి నాత్మలో దక్కి :
యతిఁజేసెనక్కటా! యాలరి బ్రహ్మ;
యితనిజూచిన నింతి యేమికాఁగలది!
అందనిపండ్లకు నఱుచాచిచాచి
[2]యెందఱు విరహాగ్ని నీదుచున్నారొ!

  1. ఉద్యోగవానులై
  2. ఇందఱు (మూ)