పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

460

ద్విపద భారతము


యుర్విఁ [1] దారిడినట్టి యుదకధనంబు
సర్వంబు మునుగొన్న చండాంశురుచుల
నాకాశపథమున నాఁగినట్లాగి,
చేకొన్న యురుములచే ధిక్కరించి,
జడనిధిఁద్రావుచో సందడిఁగొన్ని
బడబాగ్నికణములు పర్విచొచ్చుటయుఁ,
గడుపునకవిగాక గ్రక్కుచందమునఁ
బిడుగులొక్కొకమాటు పృథివిఫై రాల్చు;
నెలగోలు వర్షించి యేఱులువఱసి,
యిలయెల్లభేదించు నివిధూర్తులనుచు;
ననిమిషేంద్రుఁడు తమ్మునాఁక పెట్టించె
ననితోపఁ గొండల నడఁగు నొక్కెడల;
సైరణ నాఁకొన్న చాతకద్విజులఁ
బారణకై మింటఁ బంక్తి సాగించి,
[2]పరితోషమునఁ బాఱిపాఱివడ్డించ
పరుసున నుడువీథిఁ బాఱునొక్కెడల;
నటులచందమున నానారూపులగుచుఁ,
గటకరత్నంబులగతి మెఱయుచును,
నిలిచి రోగులువోలె నీరు గ్రోలుచును,
గలములగమివోలె గాలిఁబోవుచును,
యుద్ధభీతులువోలె [3]నుక్కడఁగుచును,
నిద్ధపార్థులువోలె నిటనల్లనగుచుఁ, (?)
బ్రతియోధులునుబోలెఁ బన్నివచ్చుచును,
శ్రుతరాక్షసులువోలె సూర్యునాఁగుచును,
[4]గెడయు పార్థులువోలె గిరులఁదోచుచును,
జడివట్టి యిట్లు వర్షపయోదములు
 

  1. తారిమిడిన
  2. పరితోదకము
  3. నుక్కటయగుచు
  4. కినిసి (మూ)