పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

446

ద్విపద భారతము


గంగ మునింగి గంగాద్వారమునకు
సంగతినేఁగి మజ్జనమాడువేళఁ,
గౌరవ్యుఁడనుపాము గన్నట్టికన్య
శ్రీరమ్య [1]యగు నులూచీనామధేయ
[2]గొంతులతో నందుఁగొలనాడఁబోయి,
యంత నాతనిమూర్తి కాత్మలోఁజొక్కి
"యేవాఁడొకో! వీనినేఁజూచియెఱుఁగ;
భావజన్మునికంటెఁ బసమేనివాఁడు!
కట్టక ముట్టక ఘననీలరత్న
మిట్టిరూపముదాల్చె; నింతియకాక,
మణిగాక మేనొండు మలయునోయిట్లు!
...........................................
విస్తీర్ణతరమైన వీని [3]వక్షమునఁ
గస్తూరిగంధికిఁ గాపుండవలదె!
కొనగోర నితఁడింత గుఱిసేయఁడేని,
చనుఁగవఫల మెంత జవ్వరాండ్రకును!
'ఏను లీలావతి నీక్షోణి' - ననుచు
వీనిముందట నిల్వ వెలఁదియెక్కడిది!
ఈక్షణంబున వీనియీక్షణంబులకు
లక్షనిష్కములైన లంచమీవచ్చు;
గలుగునొకో వీనికౌగిలి నాకుఁ!
గలుగకుండినఁ జేటు కామునిచేత.
హీనవృత్తికిఁ జొచ్చి యీ స్నానవేళ
నేను బ్రార్థించిన నితఁడేలవినును!
కొనిపోయి పాతాళకుహరంబులోన
నునిచి ప్రార్థించెద నొయ్యన" ననుచుఁ

  1. ముగ
  2. ఈపదమును స్త్రీపర్యాయముగా వాడియుండును. చూ. ఆ.ప.చ.ఆ 207.పు.
  3. వక్షంబు (మూ)