పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

445


అనినఁగవ్వడిపల్కు: "నదియట్ల తగును;
మునియాజ్ఞ మీఱుట మోసంబుగాదె!
మనల దుర్ణయులుగా మనుజు లెన్నుదురు;
జననాథ, పోవుటచందంబునాకు;
ఒకయేఁటిపనియెంత! యుల్లమట్లైన
వికసించునా." కని వీడ్కొనికదలి,

అర్జునుతీర్థయాత్ర


తిలలు ధాన్యంబులు ధేనువత్సములుఁ
గలశంబు లాజ్యంబుఁ గనకంబుఁ గంచుఁ
[1]బులకండమును రత్నములు లవణంబు
వెలిపచ్చడంబులు వెండి యాదిగను
ననుపమ దానపదార్థముల్ గొనుచు
ఘనధర్మవతిదాటి కాళిందిదాటి,
రథదాన హయదాన రవిమూర్తిదాన
పృథులగోదానముల్ పెక్కాచరించి,
యాదెసఁగదలి ప్రయాగతీర్థమున
నైదురాత్రులు నిరాహారుఁడై నిలిచి,
పరిపూతహృదయుఁడై పారణవేళ
ధరఁ గోటికన్యాప్రదానముల్ చేసి,
యక్షయ[2]వటమున్న యాపర్వతంబు
నీక్షించి, కాశికినేతెంచి, యందు
దీనులై నవసినతీర్థవాసులకు
వానగాఁ గనకంబు వర్షించి, మఱియు
శివుని సహస్రాభిషేకపూర్వముగ
భువనైకపూజ్యునిఁ బొసఁగఁ బూజించి,

  1. ఫుల్లఖండంబు
  2. వటమును(మూ)