పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

447


గరపల్లవమున నక్కామినిఁ దిగిచి
యురగలోకమునకు నువిద తెచ్చినను
ధీరుఁడై కనువిచ్చి దేవేంద్రసుతుఁడు
భూరిసర్పములున్న పుణ్యగేహములు
బొసఁగ నింద్రునివింటిపూదెలోయనఁగఁ
బసనారఁబర్విన ఫణరత్నరుచులు,
వేవేగ శేషునివేదశాస్త్రములు
భావించి వినుచున్న బాలసర్పములు,
జెదరినముత్యాలచిప్పలువోలె
నదనుతో బగిలినయండఖండములు,
మందిరాగ్రములెక్కి మారుతంబులకు
విందులై [1]తినుచున్నవృద్ధనాగములు,
వనితలు గానంబు వలనొప్పఁజేయఁ
గొనియాడి చొక్కిన కొదమసర్పములు,
నమృతంబునాకిన యలవాటనంగఁ
గొమరునాల్కలుగ్రోలు క్రూరపసర్పములుఁ
[2]దుట్టె పింజర నీరుదొత్త మన్ దిండి
కట్టెడ త్రాచు రక్తపుమండలంబు
నెనసిన జెఱ్ఱిపో తిరుదలశిఖిని
పెనుఁబాము పసిరిక పెరజు నాదిగను
నొక్కొక్కవీథికి నుప[3]విష్టులగుచుఁ
బెక్కుతెఱంగుల బెరయుసర్పములఁ
జిత్రవైఖరిని వీక్షింపుచు వచ్చి,
సుత్రామసూనుండు సుదతియిల్ సొచ్చి,
పనివడిమూఁగినపన్నగాంగనల
ననుచుతీవ్రతఁజూచి యాకన్నెకనియె :
 

  1. వినుచున్న
  2. దుట్టపింజరనితతొత్త
  3. దిష్టు (మూ)