పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

422

ద్విపద భారతము



భక్తపరాధీన, భక్తినిధాన,
శక్తిసమాలింగ, సద్భావలింగ,
అక్షర, అవ్యక్త, ఆద్యంతరహిత,
అక్షయ, అచ్యుత, [1]హర, నీలకంఠ,
మూర్తిత్రయము నీవ; మూర్తివి నీవ;
మూర్తి[2] భావనసేయు మూర్తివి నీవ;
కర్తయు నీవ; వికర్తయు నీవ;
భర్తయు నీవ; సంహర్తయు నీవ;
గౌరీయుతుఁడవయ్యు గరిము నొక్కఁడవు;
చీరలేకుండియు క్షితి నీశ్వరుఁడవు;
అరయ నుగ్రుఁడవయ్యు నధికశాంతుఁడవు;
గరళకంఠుఁడవయ్యు గడునమృతుఁడవు;
బ్రాఁతిగా శుచివై కపాలహస్తుఁడవు;
భూతనాథుఁడవయ్యు [3] భూతియుక్తుఁడవు;
కడు రెండువేలనాల్కలశాస్త్రి నీకుఁ
దొడవఁట పొగడెడు దొర వేఁడి నిన్ను!'
అని సన్నుతించుచో, హరుఁడు : “ నీకెద్ది
వనిత, వాంఛిత!' మన్న, వదలకిట్లనియె:
“మగని మగాతని మగవాని నాకు
మగదిక్కు, మగదెస మదనారి, యీవె !'
అని యిట్లు మదనపరాధీనగాన
మన నైదుమాఱులు మగనివేఁడినను;
నగుచు శంభుండు తా నాతికిట్లనియె:
“మగలేవురగుదురు మహిలోన నీకుఁ ;
[4]బాంచభౌతికమైన ప్రాణంబు భాతిఁ
జంచలేక్షణ, నీవు సమకూరు.' దనిన
 

  1. హరి
  2. భావము
  3. భూత
  4. పంచభూతిక (మూ)