పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

423


నావారిజాక్షి: 'యేనట్లైన నొల్ల;
దేవ, యీ వరము ధాత్రికి హాస్యకరము.
ఒకతెకొక్కడెకాక, యుర్విఁ బెక్కండ్రు
వికృతపుమగలైన విననెట్లుపొసఁగు!
నాలుకతడఁబాటు నగచాప, యోర్చి
పాలింపు' మనుటయుఁ, బార్వతీ ప్రియుఁడు :
ఏనఁటవరమిత్తు! నిది నగుఁబాటు
గా నెట్లువచ్చు! ముగ్ధా! వెఱనకుము;
ఏవురు నీమీఁద నెడపనిప్రేమ
గావింతు రన్యోన్యకలహంబు లేక;
నీకు నేవురమీఁద నిచ్చ భోగేచ్ఛ
చేకూరుఁ; బ్రాయంబుఁజెలువంబుఁజెడదు;
అనిశంబు మగుడఁ బ్రాయమువచ్చు నీకు;
దినమొక క్రొత్త వర్ధిలుఁ జక్కఁదనము.
ఆవిచారముచాలు నబల, యిచ్చటికి
దేవేంద్రుఁదోడ్కొని తెమ్ము పొ.'మ్మనిన,
నదియుఁ : 'దెచ్చెదఁగాని యభవ, యిచ్చోటఁ
గదలకయుండుమీ కరుణాఢ్య!' యనుచు
నాయతగతి యొక్క యతిదూరయాత్ర
పోయి, గంగాతీరమునఁ గాచియుండె.
అటమున్న యముఁడు నిజాధికారమునఁ
బటుజంతుహింస తప్పక చేసిచేసి
వేసరి : 'యీ ఘోరవృత్తి కేనోప;
నాసరివారిలో నవ్వు బాటిదియు
తియ్యని సంసారతృష్ణ పోలేక
[1] కుయ్యిడుజనులను గూల్ప నావశమె!

  1. కుయ్యని యజనంబు గూల్పనావశమె (మూ)