పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

421


శాంతాత్మ, శివ, శంభు, చంద్రార్ధమకుట,
కాంతానుషంగిత, కలితసంగీత,
శర్య, మహేశాన, జాహ్నవీమకుట,
సర్వసమ్మిత, [1]భూతజగదధివాస,
నిర్మలగుణ, భీమ, నిరవధితేజ,
ధర్మసంభవదేహ, ధర్మాత్మవాహ,
మదనకోటిసమాన, మదనసంధాన,
మదనమర్దనదక్ష, మర్దితదక్ష ,
కర్మకలాపైక కారణాధార,
( నిర్మల నాకధునీ జటాభార,)
రుద్ర, విద్రావిత రూఢాసురేశ,
భద్రాత్మ, పరమేశ, పరశుప్రకాశ,
కల్యాణనగచాప, కల్యాణ [2]కరణ,
కల్యాణవారాశి, కల్యాణనిలయ,
తారకాధిపజూట, తారకాలోక,
తారకాసురవైరి, తారకా[3]పాంగ,
హరినేత్రపూజిత, హరిహయవినుత,
[4]హరిబాణ, జితదైత్య, హరిరాజవర్ణ,
కృష్ణాజినచ్ఛన్న, కృష్ణాజివినుత, (?)
కృష్ణాభిరతికంఠ, కృష్ణాజిధీర, (?)
నందితాండవలోల, నందితాజాండ,
నందితాపసగమ్య, నందితాను[5]చర,
సప్తసామ[6]స్తుత, సప్తార్చిరూప,
సప్తలోకాధార, సప్తాశ్వనయన,
విజ్ఞానమయరూప, విమలకలాప,
ప్రాజ్ఞ[7]మానసగమ్య, బంధురక్షమ్య,

  1. భీతజగతాన్నివాస
  2. కరుణ
  3. ధాంగ
  4. హరిజాణ
  5. చిర
  6. స్వత
  7. సౌగ్యగమ్య (మూ )