పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

413


పూచి దాక్షాయణిపూబోణిఁ గాదె!
ప్రాచేతసులుకొంటఁ బదుగు రొక్కతెకు;
[1] నాశినౌరునికూఁతు నగితాఖ్యకన్య
నీశయ్య నైషధులేవురు గొనరె!
వింతగా." దనిన వివేకించి ద్రుపదుఁ:
“డింత కార్యము నిర్ణయింప నే వెఱతు;
నెల్లి ధృష్టద్యుమ్నుఁ డీవును గొంతి
యెల్లపెద్దలుఁ గూడి యీ ప్రయోజనము
మనమునఁగాంతము; మాకుఁజూచినను
విను లోకమునకిది వింతగానోపు.”

వ్యాసుఁడు ద్రుపదుఁ గానఁబోవుట



అనునంత ద్రుపదుని యాత్మసందేహ
ఘనతిమిరమువాపు గ్రహరాజు వోలె
వ్యాసుఁ డచ్చోటికి వచ్చిన ద్రుపదుఁ :
'డీసమయంబున నీపుణ్యమూర్తి
వచ్చుట నాభాగ్యవైభవం' బనుచు
నిచ్చలోఁబొంగుచు నెదురుగాఁబోయి
“మునిసింహ, తుభ్యన్నమోనమ' యనుచు
.............................................
‘ముక్తీశ ! తుభ్యన్నమోనమ' యనుచు
నిలమ్రొక్కి కైదండయిచ్చుకవచ్చి
కలితజటా[2]భారుఁ గనకపీఠమున
నునిచి పూజించిన, నోలిఁ బాండవులు
మునికిఁ దల్లియుఁ దారు మ్రొక్కిరి ప్రీతి.

  1. మూలభారతములం దీగాథ కన్పడకుండుటచే ఈ విషయస్వరూప మిట్టిదని సవరింప
    వీలు కాదయ్యెను.
  2. చారు (మూ)