పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

414

ద్విపద భారతము


అంత వారల మౌని యాశీర్వదించి,
సంతోష మొప్పఁ బాంచాలునిఁబలికె:
"కూతుఁగాంచి పయోధి కొనియాడ [1]వెలసెఁ;
గూఁతుఁగాంచి హిమాద్రి కొనియాడ [2]వెలసె;
[3]నీవు ద్రౌపదిఁ గాంచి యీ పాండవులకు
దేవిగా నీఁగంటి; [4]ధృవగీర్తి గంటి;
వేలుపుమ్రాఁకుల విద్రుమలతికఁ
గీలుకొల్పుటయిది కీర్తింపనొప్పు.
[5]నీకు వీరల ప్రాపు, నీప్రాపు వీరుఁ
గైకొనివచ్చిరి కడునొప్పుఁ బనులుఁ.
ఏవురకొకకన్య నెట్లిత్తుననుచు
నీవు చింతించుట నృప, యేనెఱింగి
తెలుపవచ్చితి; నీకుఁ దెలియ దీకుంతి
పలుకు ధర్మజుపల్కుఁ బరమార్థమగుట;
ఈజాడ యెంతయు నెఱిఁగింతు నీకు
రాజ ర"మ్మని యోగిరాజు లోపలికిఁ
బాంచాలుఁ గొనిపోయి పలికె నేకతమ:
“పాంచాలికిట్టి శోభనము భావ్యంబు;
మఱి దీనిపూర్వజన్మస్థితి వినుము;
తెఱఁగొప్ప వినిన వర్ధిల్లుఁ బుణ్యములు;

పంచేంద్రోపాఖ్యానము



లలనాలలామ [6]నాలాయని యనఁగఁ
గలదు మౌద్గల్యునిగాదిలిబోఁటి;
చిత్తజుదీమంబు, చెంగల్వబంతి,
మెత్తనిమేనిది, మీనాయతాక్షి,

  1. వలసె
  2. వలసె
  3. నీద్రౌపదిని గాంచి,
  4. ధృతి
  5. అన్వయము చింత్యము.
  6. నారాయణి (మూ)