పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

407


జీఁకటిపొద్దు రక్షింత' మన్నట్లు
మూఁకలుమూకఁలై మొగిడెఁ బద్మములు;
వరుస మిన్ననునీలవస్త్రంబుమీఁదఁ
బఱపుమై ముత్యాలు పచరించిరనఁగ
నక్షీణ తారతమ్య ప్రభావమున
నక్షత్రకులములు నభమునఁదోచెఁ;
దనమీదఁ బార్థుండు ద్రౌపదిఁదెచ్చు
కినుకపోలిక నుర్వి గిరికుచ[1]శ్రీలు
చూపక మేలుముసుంగిడె ననఁగ
వేపర్వె జీఁకట్లు విశ్వంబునిండ;
శ్రీకంఠుఁ డర్ధనారీస్వభావంబు
గైకొన్న, నతనివక్షము [2]తెన్నుచూచి,
యాలీల తమకురా [3]నట్లాయె ననఁగ
నోలినొప్పెఁ గొలంకు లొంటిజక్కవలఁ;
జంద్రాన్వయుల పెండ్లి సంభ్రమంబునను
జంద్రునెచ్చెలులెల్ల సంప్రీతిఁగనుట
తగవని వికసించెఁ దత్కైరవములు
జగతిపైఁ బర్వంగఁ జంద్రికావితతి.
ఆరాత్రి కుంతి భిక్షాశనంబునకు
గారాబుకొడుకులఁ గ్రమ మొప్పఁబనుప,
వారేఁగి భిక్ష పూర్వప్రకారమునఁ
గోరితెచ్చినఁ, గుంతి కోమలిచేత
దేవార్థ మొకపాలు తివియించి, యందు
భావించి యతిథితర్పణకొకపాలు,
చిక్కినయది రెండుసేయించి, యొకటి
తక్కక మును వృకోదరునకిప్పించి,

  1. స్త్రీలు
  2. తన్నుచూపి
  3. నట్లాడె (మూ )