పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

406

ద్విపద భారతము


వెడలితి; రిదిపదివేలు: మామేలు;
కడపట నిచ్చోటఁగంటిరి శుభము.
'ధర్మ మెక్కడనై నఁ దలఁగాచు' ననుట
ధరాత్మ, నిజమయ్యెఁ దలఁప మీయందు.
రప్పించు మిము ధృతరాష్ట్రుఁ డక్కడికి ;
నిప్పించుఁ [1]ద్వద్భాగ మేనె చూచెదను.
ఈ వైభవమ్మెసు ref>మ్మిచ్చె</ref>మ్మిచ్చునసూయ;
భావింపఁ గురురాజుఁ బార్థ, నమ్మకుము,
ఏనింకఁబోయెద; నిచ్చటనున్న
మీనిర్ణయములను మెచ్చుగా.” దనుచు
గుంతికిఁ దత్పుత్రులకును జెప్పి
కంతుజనకుఁడు వోయెఁ గణఁక ద్వారకకు,
అప్పుడింద్రజు [2]గెల్పు నాత్మసంభవుని
నొప్పియుఁజూచి, మనోవ్యధ నినుఁడు
జగమునిర్వాహంబు చాలించెననఁగ
మొగి [3]మింటఁ బశ్చిమాంబుధిచాయ డిగ్గె;
'తగఁ గాలనృపతి యాధర్మాధికులను
బగలుచేసెదవని పట్టించె గిరిని
..............................................
..............................................
రథముసగంబు సారథిపిచ్చుగుంటు
రథికుఁ డట్లయ్యుఁ జేరఁగవచ్చి నన్ను'
[4]అని ప్రతీచీకాంత యనురక్తి నెఱపెఁ
[5]దనువెల్లననఁగ సంధ్యారాగమెసగె;
'ఇందిర హరిదేవి యిల్లడసొమ్ము
మందిరమనివచ్చి మనలోన జేరెఁ;

  1. దద్భాగ
  2. గెల్వ
  3. మిన్ను
  4. అనినబ్రాచీ
  5. తనువెల్లి (మూ)