పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

408

ద్విపద భారతము


[1]...................................
....................................
నీకినిల్వఁగఁ గొంతనిలిచినకూడు
చేకొని యదిరెండుచేసి, వేవేగఁ
గోడలుఁ దానును గుంతిభుజించి
వేడుక శయ్యల విరచింపఁబనుప,
నవదర్భశయ్యలు నాతి యేవురకు
సవరించి, మఱి వారిచరణాగ్రభూమి
నాదిగర్భేశ్వరియయ్యు శయించె;
[2] రాదు స్మయంబంత రాచకూఁతునకు;
వింతవారలుగదా వీరనికొంత
చింతింప; దెవ్వరు చెప్పిరోబుద్ధి!
ఇట్టివృత్తాంతంబు లెంతయునరయ
నెట్టనఁ దనయుని నృపుఁడు దా మున్న
యతిరహస్యంబుగా ననుపుటఁజేసి
యతఁడేఁగి యన్నియునరసి, యారాత్రి
ధరణీశుకడ కేఁగి తగుభ క్తి మ్రొక్కి
వరుసతోడుతఁజెప్పె వారివర్తనము :
"జననాథ, యే వారిచరితంబులెల్లఁ
గనుఁగొనివచ్చితి గడఁగి మీరనుప;
సుక్షత్రియులు వారు చూచినఁదెలియు;
నీక్షోణిపై నెన్న నితరులుగారు.
తలపోఁతకై రాత్రి తమలోనఁ దారు
పలుకుకొన్నారట్టి పలుకులేవింటి.
పరసేన భేదనో[3]పాయ క్రమంబుఁ,
బరబాణ భంజనోపాయ క్రమంబుఁ,

  1. ధర్మజాదులకు అన్న మిడిన విషయమిట లుప్తమైయుండును.
  2. రాదిస్వయంబంది రాచకూంతులకు,
  3. పాయనక్రమము (మూ)