పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

397


అన్యోన్యశరధార లనలంబు లీనఁ,
గన్యావిహహాగ్నిగతి మండుచుండె;
లాజలగతి హారలత లందుఁదునిసె;
రాజరక్తం బాజ్యరాజి[1]గా దొఱఁగె;
విసిరి భీముఁడువ్రేయ విఱిగినరథము
లసమున సమిధలై యాయగ్నిఁబడియె;
ఆసర్వనృపుల వీరాలాపరవము
రాసియై వేదమంత్రధ్వనిఁ బోలెఁ ;
బదిటఁ బదారింటఁ బండ్రెంట రెంటఁ
బదివేలు లక్ష తప్పనిసాయకముల
నాటింపఁ, జూచి సైన్యములురోషమున
మీటుగల్గినయట్టి మెఱవడితోడఁ
గరివాఁడు హరివాఁడు కాల్నడవాఁడు
నరదంబువాఁడునై యాశ్చర్యలీల
సవ్యసాచిరథంబు సందీక పొదివి
సవ్యాపసవ్య శస్త్రంబులఁ గప్ప,
వాయుజుండును సైన్యవారిధిమీద
బాయక బడబాగ్ని పడినట్లు గదిసి,
తాపులుఁదోపులు దప్పఁ గావించి,
వీపుల దాపల విఱుగఁ ద్రొక్కుచును,
వాటుల వ్రేటుల వడిఁ బాఱమీటి,
మీటుల గూటుల మెల్లెవాపుటను
గలగుండువెట్టి, దిక్కరిచొచ్చికలఁచు
కొలనుసేసిన, గండుగూలి యబ్బలము
అర్జునుపసవ్రేట్ల నాభీమువాట్ల
జర్జరితాంగులై జడియఁజొచ్చుటయుఁ,
 

  1. మీందొఱంగె (మూ )