పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

398

ద్విపద భారతము


గర్ణాదు [1]లొక్కఁడొక్కఁడ యేనికెక్కి
తూర్ణవైఖరి భీముతోఁ బార్థుతోడ
సమరంబుసేయ, నాచండాస్త్రవృష్టి
గమలబంధుఁడు [2]డాఁగి కమ్మెఁజీఁకట్లు;
అరుణరత్నాభ సంధ్యారాగ మెసగెఁ;
గరికుంభదళిత ముక్తాతారలడరె;
నిబిడహుంకృతి ఘూకనినదంబు లెసగెఁ;
బ్రబలి బాణాంధకారము పెచ్చుపెరిగె;
ధరణీశ్వరుల మోముదమ్ములు మొగిడెఁ;
గరమొప్పఁ బ్రతిపక్ష కలకలంబడఁగె;
ఘనభూతమిథున చక్రంబులు గూడె;
ననిమిషేక్షణ చకోరావలి చెలఁగె;
వదల కెల్లెడ బాణవాయువుల్ వీచెఁ;
గదనమొప్పె నకాలకాళరాత్రగుచు.
దేవేంద్రుఁ డమరావతీకవాటములు
వేవేగఁ బెట్టించె విజయాస్త్రభీతి.
పెండ్లికి [3] వచ్చినపెంపేది రంభ
పెండ్లికేఁగిరి భటుల్ బీభత్సుఁడనుప.
రథములువిఱిగి, వారణములు దొఱఁగి,
పృథివిపైఁ బీనుఁగుపెంటలై పడియె.
అట్టిచో శల్యుఁడాహవదక్షు ననిలు
పట్టి నార్చుచు నిల్వఁబట్టిన, నతఁడుఁ
దనకాలఁ దగిలినతామరనూలు
వనకరి గొననికైవడిని గైకొనక
తానంత శల్యునిఁదగులఁబట్టుటయు,
లోనయ్యెఁగీర్తికి; లోనయియతఁడు

  1. లెక్కడెక్కడ యేనకెక్కి
  2. గ్రాగి
  3. వచ్చుటవెంపోయి (మూ)