పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

370

ద్విపద భారతము


ఆవెన్కఁ దత్పుత్త్రు లవని నేలుచును
ఆవిప్రులకు ధనంబబ్బుటయెఱిగి,
భృగుతనూభవులను బిలిపించి బలిమిఁ
దెగనియర్థముతృష్ణ, దివిఱియిట్లనిరి :
'ద్విజులార, మీకేల విపులార్థతతులు!
విజయింపవలె మాకు వేగంబె తెండు'.
అనిన, వారలు ధనమట్లీయకున్నఁ
గిసిసి భార్గవుల నాక్షితిపులు చంపి,
దాఁచినధనములు దాఁకఁగైకొనుచుఁ
బూఁచి [1] యెవ్వనినిందుఁ బొడమనీమనుచు
నర్భకులాదిగా [2] నణఁగించుచోట,
గర్భంబు నొకకాంత గరిమతోఁ దొడల
ధరియించెఁ బదియేండ్లు; తగ నంతమీద
సురుచిరాత్మకుఁడైన సుతునిఁ గాంచుటయు,
నరయంగ నాపుత్రుఁ డౌౌర్వుఁడై పెరిగి
జననిచే జనకులచా వెల్ల నెఱిగి
ఘనతపంబొనరింపఁ, గలకె లోకములు;
సురరాజు భీతిల్లె; సూర్యుండుసళ్ళె  :
నరుదందెభవుఁ; డజుండతిభీతిఁబొందె
నప్పుడౌర్వునితండ్రు లచటికి వచ్చి
యుప్పొంగి పలికిరయ్యురుతపోధనుని :

పితరు లౌర్వుని శాంతునిఁజేయుట



“ఓవత్స! యింక నీయుగ్రతపంబు
గావింపవలదు లోకములఁగాల్చెడిని
కృతవీర్యసుతులచేఁ గృతమున నేము
సతతధనాపేక్ష జచ్చుట లేదు;

  1. యెవ్వాడిందుఁ బొడమనిమనుచు
  2. అగణించుచోట, (మూ)