పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

369


కాలోప[1]నీతుఁడై కలవిద్యలెల్ల
లీలమైనేర్చి, వాలికప్రాయమునను
దాతకు నెఱిఁగించి తపమునకరిగి
ప్రీతితోడఁ దపంబు పెక్కేండ్లుచేసి,
హరి ధాత హరులఁ బ్రత్యక్షంబుచేసి,
వరుస వారలచేత వరములువడసి,
మరలి యే తెంచి యామహితాత్మకుండు
గురుతరంబుగఁ దాతకును భక్తి మ్రొక్కి
పలికె: "భవ్యాత్మక, ఫలియించెఁదపము;
అలరి మిమ్మొకటి నేనడుగవచ్చితిని;
పితృఋణంబుడుపని బిడ్డఁడేమిటికి!
బితరులకెల్లను బ్రియముగా నిపుడు
ఘోరతపంబునఁ గుటిల రాక్షసులఁ
బేరుమాన్పెద నన్నుబ్రియముతోనసువు. '
మనవుడు నమ్మౌని మనుమనిఁబలికె :
"ననఘ, తపంబేల యల్పంపుఁబనికి!
నుగ్రతపంబున నొక కీడు దోచు;
 [2]వ్యగ్రత దానిచే నణఁగులోకములు.
ఈయర్థమునకు నే నితిహాసమొకటి
ధీయుక్తిఁ జెప్పెద ధీరాత్మ , వినుము.
కృతవీర్యుఁడనురాజు క్షితియేలి మున్ను
జతురతఁ గావించె సకలయజ్ఞములు.
ప్రీతి యాజకులైన భృగునందనులకు
బ్రాఁతి దక్షిణలుగా బహుధనంబొసగి
యాపుణ్యఫలమున నాండ్రును దానుఁ
బ్రాపించె నాకంబు పార్థివోత్తముఁడు.

  1. నియతుఁడై
  2. అగ్రత (మూ )