పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

371


పరలోక సౌఖ్యంబు ప్రాపించుకొఱకుఁ
బొరలి యావిధమునఁ [1]బొలిసితిమింతె'
అనిన నౌర్వుఁడుపల్కు : “నమలాత్ములార,
యెనసిన యీతపంబేమాన్తి నేని,
నన్నునే గాల్చు నీనవతపోవహ్ని;
యున్నతి నెచ్చోట నునుతునే' ననిన
నంతయుఁ జింతించి యమ్మౌనులనిరి:
'వింతతపోవహ్ని విమలాత్మ! యిప్పుడు
జలముల [2]లోకముల్ జనియించెఁగాన
జలధిలోవైవుము జలము గ్రోలంగ.'
అనిన వారలమాటలంగీకరించి
యనిచి దండమువెట్టి యౌర్వుండువోయి,
తనతపశ్శిఖ సముద్రములోన వైవ
ననయంబు బడబాగ్నియై యుండె; నంత
నౌర్వుఁడు నటవచ్చి యంబయుఁ గాను
సర్వకర్మంబులు సలుపుచు నుండె.
కావునఁ బౌత్రక, కడిదితపంబు
గావింపవల దింకఁగార్యంబువినుము.
రాక్షసక్షయముగా రమణ జన్నంబు
దీక్షతో జేయంగఁ [3]దివుఱుము నీవు."
అని వశిష్ఠుఁడుచెప్ప నప్పరాశరుఁడు
విని యిచ్చగించి యవ్విపినమధ్యమున
సకలసాధనములుఁ జయ్యనఁ గూర్చి
ప్రకటించి రాక్షసప్రళయయాగంబు
చేయుచునుండంగఁ, జెదరిదానవులు
నాయజునకుఁ జెప్ప, నద్దేవుఁడపుడు

  1. బోరితి
  2. జ్వలనంబు
  3. దిమురుము (మూ)