పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

363


కరులనుదెగటార్చి, కలఁచిమావుతులఁ,
దురగాళిఁ [1]జఱచి, రౌతుల [2]నేలఁగలిపి,
యోడక కాల్బంట్ల నుక్కడగించి,
[3]వాఁడిమిగా మోది వదలకయార్వ,
హతశేషమైన విశ్వామిత్ర బలము
క్షితియెల్ల యెడలను జెదరి చేడ్వడియె.
అప్పుడు నందిని హంబారవంబు
లుప్పొంగ మేయుచు నొగిఁబంచతిలుచుఁ
దనక్రేపు వేడ్కమైఁ దఱచునాకుచును
మనముగా విహరింపఁ గౌశికుఁడంత :
'నచ్చుగా నక్కట! యావుచే నిట్లు
చెచ్చెఱ నాసేన చిందువందయ్యెఁ!
బటురాజతేజంబు బ్రహ్మతేజమున
కెటువలెఁజేసిన నీడుగా. " దనుచుఁ
బటుతరనిష్ఠ మై బ్రహ్మకుఁ దపము
.................................................
పెక్కుకాలంబులు పెక్కురీతులను
దక్కక సేయఁ బ్రత్యక్ష మైయజుఁడు :
“అనఘ, నీకోరు బ్రహ్మర్షిభావంబు
ఘనవసిష్ఠుఁడు వల్కఁ గలుగు నీ." కనుచు
నానతి చేసి యయ్యజుఁడు వోవుటయు,
జానొప్పవేడ్క విశ్వామిత్రుఁ డపుడు
రమణ నరుంధతీరమణుముందఱకు
సమబుద్ధి నేతెంచి చతురతనిలిచె.
నిలిచినఁ గనుఁగొని నెఱి వశిష్ఠుండు
లలి 'రాజముని! కుశలంబెనీ? కనిన,

  1. చలిపి
  2. గాల
  3. వాడలు (మూ)