పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

353


ఘనరూపసంపద గలిగినయట్టి
వనితనొక్కతెఁ జూచె వసుమతీవిభుఁడు.
పడఁతిఁజూచినచూపు పరికించి తివియు
వడుపునఁ దలయూఁచి వర్ణింపఁ దొడఁగె:
"ఈకాంతముఖకాంతి కెన [1]చేయఁబూని
యాకంజభవుఁ డమృతాంశుని నెపుడు
నెలకునొక్కొకమాఱు నెఱిఁజెఱిచిచెఱిచి,
కలగాలమును నిట్లు గడపుచున్నాఁడు.
ఏవంక యీలేమ యెలమితోఁ జూచె,
నావంక నలగల్వ లమరినట్లయ్యె;
నీయింతి చనుదోయి యెలమినొండొండ
రాయుచున్నవి గడిరాజులువోలె;
వలరాజు చేపట్టు వాలునుబోలె
వలనొప్పు వళుల నీవనితరోమాళి;
'జలజబాంధవుఁ డేకచక్రరథంబు
గలిగినమాత్ర లోకములెల్లఁ దిరిగె;
రెండుచక్రములయంత్రితమైనరథము
దండిగల్గిన నేను దాటనే యతని'
నని కంతుఁ డొకరథంబాయత్తపరఱె
నన నొప్పె నీయింతి కాజఘనంబు;
అతికర్కశంబులు హస్తితుండములు
సతతశీతలములు జగతినరంట్లు,
కావున నీభామ కలితంపుఁదొడల
కేవిధంబున సవతెన్నంగరాదు;
ఈనాతి పదముల కెనగాఁగఁదలఁచి
పూనెఁ దపంబు నంబుజములు నీట;

  1. గాగ (మూ)