పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

352

ద్విపద భారతము


ఇటమీఁదఁ [1]గృతపురోహితులౌచుఁదిరుగఁ
బటుబుద్ధి వైరులు పగులంగఁగలరు;
కావున మీరలు ఘనపరాక్రములు
భావింపఁ బరధర్మభరితమానసులు
తాపసునోక్కనిఁ దావత్యులార,
చేపట్టుఁడబ్బెడు శ్రీయును జయము.
అనుడు గంధర్వున కర్జునుండనియె:
"వినుతాత్మ, నీచేత విననయ్యెవింత;
కౌంతేయవిఖ్యాతి ఘనత మై నుండ,
నెంతయుఁ దాపత్యు లేలంటివిపుడు?
వినయంబుతోడ నీవృత్తాంత మెల్ల
విన వేడుకయ్యెడు వినిపింపుమాకు."
అనుడుఁ గవ్వడిఁజూచి యమరుఁడిట్లనియె:

తపతీసంవరణము



“ఘనశౌర్య, యాకథ కడముట్ట వినుము;
భారతవంశాబ్ది పరిపూర్ణచంద్రు
డారయ సత్యధరాంచితాత్మకుఁడు
ధరణి నజామీఢతనయుండు ఘనుఁడు
వరయశోధనుఁడు సంవరణుండు తొల్లి
ధరణితలంబెల్ల ధర్మమార్గమున
నరయుచు, వేడ్కమై నతఁడొక్కనాఁడు
వాటంపుసేనలు వలనొప్పఁ గొలువ
వేఁటకై చనుదెంచి విపినంబులోనఁ
గంతునిదీమంబు గాంతాలలామఁ
గాంతి నారతినైనఁ గైకోనిబోఁటి

  1. బహుకృపాహేతివైతిరుగ (మూ )