పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

349


ధృతిఁ గాష్ట్రమెత్తి యెంతే నగ్నిమెఱయు
గతి నర్జునుఁడు చేతి కాండాగ్ని పెంచి
సేననంతట మహాశిఖిఁ గప్పుటయును,
నానాముఖంబుగా నడికి యాసేనఁ
గొందఱుభయమంది, కొందఱుమ్రగ్గి
కొందఱు దరికొని, కొండఱుగమరి,
చేతులాడక [1]చేదుచిచ్చునఁదొల్లి
భీతిల్లు సురసైన్యబృందంబు వోలెఁ
బ్రాణభయంబున భగ్నులైపాఱ,
నేణలోచనలతో నితఁడొంటినిలిచి
నవనిధీశ్వరదత్తనారాచపంక్తి
కలిసి మంటలుగ్రమ్మ గవ్వడి మీద
గుప్పిన, నావృష్టిఁ గొఱవిచేఁదరలఁ
దిప్పశక్యముగాక దేవేంద్రసుతుఁడు
నాగ్నేయమంత్ర మయ్యగ్నికాష్ఠమున
నగ్నిప్రతాపుఁడు హత్తించి వైవ ,
నది ధగధగయని యంతరిక్షమునఁ
ద్రిదశులువెఱఁగందఁ దీవ్రమైవచ్చి
రథముపై గంధర్వరాజుగూల్చుటయుఁ,
బృథివివైఁబడె వాఁడు బిట్టుమూర్ఛిల్లి.
నరుఁడీడ్చి తెచ్చి గంధర్వు ధర్మజుని
చరణాబ్జములవద్ద సాగఁబెట్టుటయు,
నంతలోపల వానియతివలుచేరి:
"శాంతలక్షణులార, చాలింపుఁడలుక ;
[2]ఎఱుఁగఁడు మహి మిమ్ము నితఁడాడె నెగ్గు;
మఱవుడు; పతిభిక్ష మాకు నీవలయు;

  1. చేత
  2. ఎరుగుదు (మూ )