పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

350

ద్విపద భారతము


ఎట్టివాఁడు మదించు నింతులయెదుట;
నిట్టితప్పు సహింపుఁడీ." రన్న నృపతి :
"హరితనూభవ, వీరియలమటమానఁ
బురుషభిక్షార్థమై పోనిమ్ము వీని. "
అనినఁ బార్థుఁడు వానినచ్చోట విడిచి
జననీసహోదరసహితుఁడై కదల,
నంగారపర్ణుండు నంతలోఁ దెలిసి
సంగతిఁ దనమాయశక్తిచే నపుడు
కాలి నీఱైపడ్డ కనకరథంబు
లీల రావించి వాలిక[1]మొనఁదీర్చి,
యరిగెడు పార్థుల కడ్డంబువచ్చి,
సరసవైఖరి వారిసన్నుతిచేసి :
“ధారుణి దివ్యాస్త్రధరులు లోకైక
వీరులు వెసఁ బాండవేయులు మీరు;
సతులనన్నిధినున్న సాధులకైన
మతిదప్పు; నింక నామాటయేమిటికి!
వెలిఁగినరథ మేను విద్యాబలమునఁ
గలుగఁజిత్రించితిఁగాన, నా పేరు
చిత్రరథుండనఁజెల్లు; మీకృపకు
బాత్రుండ; నంగారపర్ణాఖ్యమొల్ల;
నరయంగ నేనును నర్థేశుసఖుఁడ
ధరణీశులార! యెంతయుఁగృపతోడ
.................................................
ననుగాచి పోవుచున్నాఁడవు పార్థ!
విను, నీకు గంధర్వవిద్య యిచ్చెదను;
నాకు నాగ్నేయబాణము సత్కరింపు;
చేకొని నీతోడఁ జేసెదఁ జెలిమి.

  1. మేనందీర్చి (మూ)