పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

344

ద్విపద భారతము


"మీకృపయిట్టిది, మిమునేమువిడిచి
యేకడ కేఁగెద! మెవ్వారుహితులు!
తీర్థయాత్రలు మాకు దీక్షగా వలసి
యర్థిఁబోవుట భావ్య మఖిలజ్ఞులార!"
అనుడు విప్రులు వారి నతిగారవమున
ననిచిరి పూజించి యాశీర్వదించి.
వారును, యమునాప్రవాహంబు దాటి
వారాశిఁజూచుచు వచ్చుచో, నెదుట
వ్యాసుండు హరిపరధ్యానలక్ష్మికిని
దాసుండు శ్రితకృపాదాసుఁ డే తేర,
నట్టిమౌనికి బార్థు లతిభక్తి మ్రొక్కి,
పట్టినయంజలిప్రతతులతోడ
[1]నుపవిష్టుఁగావించి యోలిసేవింపఁ,
దపసి యందఱ దయాధారనిట్లనియె:
"ద్రుపదభూపాలుకూఁతురుస్వయంవరము
నృపులార, చూడఁబూనితిరి మేలయ్యె;
ఆకన్య మునికన్య యాదిజన్మమునఁ ;
జేకొని తపము దా శివునకుఁజేసి
మగనినిమ్మని యేనుమాఱులు వలుక,
నగి చంద్రధారి యన్నాతిపల్కులకు
నీజన్మమున దాని కేవురుమగల
యోజించుచున్నవాఁ; డొకటి చెప్పెదను,
ఏకచక్రమున దైత్యేంద్రశిక్షణము
మీకతంబుననయ్యె; మీరింకఁబోయి
పాంచాలపురమున బ్రాహ్మణవేష
మంచితచ్ఛాయ పాయక వెలుంగుచును,

  1. ఉపవిష్ణు (మా)