పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

345


బొలఁతిస్వయంవరంబున మత్స్యయంత్ర
[1]దళనంబుచేసి, యాద్రౌపదీకన్య
నేవురుఁగైకొనుఁ; డింతలో నేను
దేవమూర్తుల మిమ్ము దృష్టింపవత్తు.
ఆవివాహోత్సవంబైనమీదటను
వేవేగఁ గరిపురవిభుఁడు మిమ్మెఱిఁగి,
రప్పించి రాజ్యభారంబునఁబూన్చుఁ ;
దప్పదింతయు." నని తగనానతిచ్చి
తపసి యంతర్థానధారనేఁగుటయు,
నృపతులానందించి నెఱినుత్తరముగ
వచ్చుచు, సరయూప్రవాహంబుదాటి,
యచ్చట గోవర్ధనాద్రిఁజూచుచును,
గాశ్మీరభూములు గడచి, గంధర్వ
వేశ్మమై పొడవైన వృషభాద్రిగడచి,
మునిసీమలకుఁ బురంబులకుఁ గిరాత
ఘనసీమలకుఁ ద్రోవఁగడువేడ్కఁగడచి,
యిదిపగ లిదిరాత్రి యిదిసంధ్యయనక
చదురొప్ప నమ్మహోత్సవదినంబునకు
ముందటఁ బార్థుండుమొగిఁద్రోవవెట్ట
నందఱునడచుచు, నర్ధరాత్రమున
నమరసంగతరంగ నతిమంగళాంగ
నమరంగ భవభంగయగు గంగఁగదిసి,
యేవురపెండ్లికి నీవుసాక్షివిగ
రావలెనని మహాప్రభువగ్నినపుడు
తొడుకొనిపోవుటదోపఁ జీకట్లు
జడియంగఁ గొఱవి వాసవిచేతఁబట్ట

  1. దళితంబు (మూ)