పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

332

ద్విపద భారతము


[1] నొక్కట శశిమ్రింగ నొల్లక కాదె
యొక్కొక్కకళ మ్రింగుచున్నారు సురలు!
దనుజేంద్ర, నీకు నిత్యము బండిగట్టి
యెనుబోతులను గట్టి యిరువంక రెండు,
బండిలోఁ గూరలు భక్ష్యభోజ్యములు
నిండించి, యొక్కమానిసి దోలుకొనుచు
నేతెంచు నీవున్న యెడకు; నీ వంతఁ
బోతుల మనుజుని భోజ్యంబుగొనుము.”
నావుడు నొడఁబడి నదికేఁగె వాడు.
దేవి, యీయది సాగు దిన మొకయింట;
నువిద, నూఱేండ్లకు నూరెల్లఁ గలియు;
వివరింప నీయూరి విధమదెట్టిదియొ
ఏతెంచె నేడు మాయింటికి వరుస
నాతి, పోవలె." నన్న నరనాథు దేవి :
"కలవాడు నీకు నొక్కఁడె పసుబిడ్డ,
తలఁప నేవురునాకుఁ దనయులుగలరు.
ఒక్కనిఁబుత్తు నీయుపకారమునకు
గ్రక్కునఁ బ్రత్యుపకారంబుగాఁగ;
నుంటిమి నీయింట నుల్లంబులలర;
వెంట [2]నొడల్ రాదు విప్ర, యెవ్వరికి."
అనిన విప్రుఁడుపల్కె : "నతిథుల మిమ్ము
దనుజుల కనుపుట ధర్మమా తల్లి!
గ్రామసూతకులముగావున మాకు
భామ, విధమును బాటింపవలసె;
నేనుబోయెద ." నన్న నిట్లనుఁగుంతి :
.................................................
"భీమదైత్యులువోరఁ బ్రిదులఁడీ కొడుకు;

  1. ఒక్కొక
  2. నిండ్లు (మూ )