పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

314

ద్విపద భారతము


జనవున నప్పురోచనుదూతయయ్యు
[1] మనసీక యందునెమ్మదినుండుఁగాన,
నెడతాఁకి యెడతాఁకి యిచ్చటివేగు
మడఁతి వానికి నాఁడు మఱి చెప్పుచుండి,
కుంతియింటనె కూడు కుత్తుకబంటి
వింతగా భుజియించి, వెస నిద్రతోడ
జతుశాల (?) కేతెంచి శయ్యపైఁ గూలి
మృతిఁబొందినట్లున్న, మేదినీపతులు
తారును భోజనోత్తరవేళ నెలమిఁ
జేరి కుంతికిఁ బాదసేవలు చేసి
శయనించి; రప్పురోచనుఁడు నచ్చోట
శయనించ గలదు నిషాది వేగనుచు.
ధరనట్లుకాదె! నిద్రాపరాయణునిఁ
బరఁగనమ్మినవానిపని మోసపోవు!

లక్కయిల్లు గాల్చుట



అందఱు నిద్రవో, నారాత్రి నిద్ర
పొందని పవమానపుత్త్రుండు లేచి,
యనలార్చి తెచ్చి యొయ్యన [2]రవుల్కొలిపి,
మును బురోచనుఁడున్నమూల దగిల్చి,
పోరాకయుండఁ దల్పులుదరికొల్పి,
ధీరుఁడు చిచ్చు మీఁదికిఁ బాఱఁజిమ్మి
విదురోపదిష్టభూవివరంబు తెఱచి,
పొదఁడని తనవారి బోధించినడపి,
లాగైన యస్త్రశాలలు దరికొల్పి
వేగంబె తానును వెడలి, యవ్వార్త

  1. మనసికయుండు
  2. లావు (మూ )